అమెరికా తెలుగు సంఘం (ATA) ఆధ్వర్యంలో.. ఏప్రిల్ 25న‘చెస్ టోర్నమెంట్’
ATA: అమెరికా తెలుగు సంఘం (ATA) తన సేవా , సాంస్కృతిక కార్యక్రమాల్లో భాగంగా చెస్ క్రీడాకారుల కోసం ప్రత్యేకంగా ‘PA-DE టీమ్ చెస్ టోర్నమెంట్’ను నిర్వహిస్తోంది. ఈ పోటీలు ఏప్రిల్ 25, 2026 శనివారం రోజు ఉదయం 11 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు జరగనున్నాయి. ఎక్స్టన్ (Exton) లోని ట్రైబ్రిడ్జెస్ చెస్ క్లబ్ (Tribridge’s Chess Club) ఈ పోటీలకు వేదిక కానుంది.
ముఖ్య పర్యవేక్షకులు..
ట్రైబ్రిడ్జెస్ చెస్ క్లబ్ వ్యవస్థాపకులు , ప్రెసిడెంట్ ఆఫ్ ది చెస్ జర్నలిస్ట్స్ ఆఫ్ అమెరికా జోషువా ఆండర్సన్ (Joshua Anderson) పర్యవేక్షణలో ఈ టోర్నమెంట్ నిర్వహించనున్నారు.
వివరాలు..
ఈ పోటీలు రెండు విభాగాలుగా జరగనున్నాయి.
- నాన్-రేటెడ్ (Not Rated): K-6, K-12 విద్యార్థుల కోసం.
- రేటెడ్ (Rated): Under 600, Under 1200 కేటగిరీలలో.
మొదటి ముగ్గురు విజేతలకు ప్రతి విభాగంలో ట్రోఫీలు అందజేయడమే కాకుండా, పాల్గొన్న ప్రతి ఒక్కరికి సర్టిఫికెట్లు ప్రధానం చేస్తారు. రిజిస్ట్రేషన్ ఫీజు $15 గా నిర్ణయించారు (పాల్గొనే వారికి పిజ్జా , డ్రింక్స్ అందింజేస్తారు).
ప్రతినిధుల ఆధ్వర్యంలో..
ATA ప్రెసిడెంట్ జయంత్ చల్లా, ప్రెసిడెంట్ ఎలక్ట్ సతీష్ రామసహాయం రెడ్డి నేతృత్వంలో ఈ కార్యక్రమం ఏర్పాట్లు జరుగుతున్నాయి. బోర్డ్ ఆఫ్ ట్రస్టీలు (BOT) రాజు కక్కెర్ల, పరమేష్ భీంరెడ్డి, హను తిరుమలరెడ్డి, రీజనల్ డైరెక్టర్లు అరుణ్ రుద్ర, సతీష్ బండి; రీజనల్ అడ్వైజర్లు కిరణ్ అలా, ప్రశాంత్ గుడుగుంట్ల, మహేష్ దాచేపల్లి , ఇతర కార్యవర్గ సభ్యులు ఈ టోర్నమెంట్ విజయవంతం కోసం కృషి చేస్తున్నారు.
19వ ATA కాన్ఫరెన్స్ & యూత్ కన్వెన్షన్ ప్రచారం..
ఈ టోర్నమెంట్‌తో పాటు, బాల్టిమోర్ కన్వెన్షన్ సెంటర్లో జూలై 31 నుండి ఆగస్టు 2 వరకు జరగనున్న “19వ ATA కాన్ఫరెన్స్ & యూత్ కన్వెన్షన్” గురించి కూడా ప్రతినిధులు ప్రచారం చేస్తున్నారు. ఆసక్తి గల వారు పోస్టర్‌లోని QR కోడ్ స్కాన్ చేసి వెంటనే తమ పేర్లను నమోదు చేసుకోవాలని కోరారు.








