Mani Sharma: మణిశర్మ ఈసారైనా కంబ్యాక్ ఇస్తారా?
టాలీవుడ్లో మళ్లీ మెలోడీ మ్యూజిక్కు ఊపు వస్తుందా అన్న చర్చకు తాజా ఉదాహరణగా మ్యూజిక్ డైరెక్టర్ మణిశర్మ(manisharma) పేరు మళ్లీ హాట్ టాపిక్‌గా మారింది. ఒకప్పుడు ఆయన మ్యూజిక్ అంటే హిట్‌కు గ్యారంటీగా భావించేవారు. కానీ గత కొన్నేళ్లలో వరుసగా వచ్చిన నిరాశాజనక ఫలితాలతో ఆయన రేసులో వెనుకబడ్డారు. ఇస్మార్ట్ శంకర్(ismart shankar) సినిమాతో వచ్చిన కంబ్యాక్ కూడా ఎక్కువ కాలం కంటిన్యూ అవలేదు. అయితే ఇప్పుడు చెన్నై లవ్‌స్టోరీ(chennai love story) నుంచి రిలీజైన ఫస్ట్ సాంగ్ మణిశర్మపై మళ్లీ నమ్మకాన్ని పెంచేలా కనిపిస్తోంది.
మణిశర్మను మెలోడీ బ్రహ్మగా నిలబెట్టింది ఆయన అందించిన క్లాసిక్ ట్యూన్స్. పాటలే కాకుండా బ్యాక్‌గ్రౌండ్ స్కోర్‌లోనూ ఆయన ప్రత్యేక ముద్ర వేశారు. అయితే ప్రస్తుతం టాలీవుడ్ ట్రెండ్ పూర్తిగా మారిపోయింది. హై డెసిబెల్ బీట్స్, ఎలివేషన్ బీజీఎంలు డామినేట్ చేస్తున్న ఈ సమయంలో మెలోడీకి స్థానం తగ్గిందనే అభిప్రాయం ఉంది. ఇలాంటి పరిస్థితిలో కిరణ్ అబ్బవరం(Kiran Abbavaram) నటిస్తున్న ఈ సినిమాలోని గుర్తుందా లాంటి సాఫ్ట్ ట్రాక్ మ్యూజిక్ లవర్స్‌కు ఒక రిఫ్రెషింగ్ అనుభూతిని ఇస్తోంది.
సోషల్ మీడియాలో కూడా ఈ పాటకు పాజిటివ్ రెస్పాన్స్ రావడం గమనార్హం. ఇదే ట్రెండ్ కొనసాగితే, మణిశర్మకు ఇది కేవలం ఒక హిట్ సాంగ్ మాత్రమే కాకుండా కెరీర్ రీబిల్డ్ అయ్యే అవకాశం కూడా అవుతుంది. ముఖ్యంగా న్యూ జనరేషన్ కంపోజర్స్ డామినేషన్ మధ్య, తన స్ట్రెంగ్త్ అయిన మెలోడీతో మణిశర్మ మళ్లీ తన స్థానం దక్కించుకుంటారా అన్నది ఆసక్తికరంగా మారింది.
ఇవి కూడా చదవండి








