విశ్వంభర లో కొత్త ఊపు.. ఆర్ఆర్తో మారిన సినిమా ఫీల్!
చిరంజీవి(Chiranjeevi) హీరోగా డైరెక్టర్ వశిష్ట(Vassishta) తెరకెక్కిస్తున్న ప్రతిష్టాత్మక సోషియో ఫాంటసీ మూవీ విశ్వంభర (Vishwambhara) మళ్లీ వార్తల్లో నిలిచింది. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా రిలీజ్‌పై ఫ్యాన్స్‌లో ఆసక్తి నెలకొన్న సంగతి తెలిసిందే. తాజా సమాచారం ప్రకారం సినిమాకు సంబంధించిన రీరికార్డింగ్ పనుల్లో కీలక పురోగతి సాధించినట్లు తెలుస్తోంది. మ్యూజిక్ డైరెక్టర్ గౌర హరి(Gowri Hara) ఆర్ఆర్ను పూర్తి చేయగా, కొన్ని మెయిన్ ఎపిసోడ్లకు వచ్చిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ సినిమాకు మరింత బలాన్ని తీసుకొచ్చిందనే టాక్ వినిపిస్తోంది.
సోషియో ఫాంటసీ నేపథ్యంలో భారీ స్థాయిలో రూపొందిన ఈ సినిమాకు విజువల్స్‌తో పాటు బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ కూడా కీలకంగా మారనుంది. తాజాగా ఆర్ఆర్తో సినిమా ఫైనల్ అవుట్‌పుట్‌ను పరిశీలించిన తర్వాత మేకర్స్ సంతృప్తి వ్యక్తం చేసినట్లు సమాచారం. ముఖ్యంగా కథలోని ఎమోషనల్ సీన్స్, యాక్షన్ ఎపిసోడ్లకు మ్యూజిక్ స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలుస్తుందని సినీ వర్గాల్లో డిస్కషన్ జరుగుతోంది.
ఇక విశ్వంభర రిలీజ్ డేట్‌పై కూడా త్వరలో క్లారిటీ వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఓటీటీ రైట్స్ డీల్ పూర్తిస్థాయిలో కొలిక్కి వచ్చిన తర్వాత రిలీజ్ ప్లాన్‌ను అఫీషియల్ గా అనౌన్స్ చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. త్రిష(Trisha) హీరోయిన్గా నటిస్తున్న ఈ భారీ సినిమాపై చిరంజీవి ఫ్యాన్స్ భారీ అంచనాలు పెట్టుకున్నారు. మరి అన్ని కార్యక్రమాలు పూర్తయ్యాక విశ్వంభర ఎప్పుడు ప్రేక్షకుల ముందుకు వస్తుందో చూడాలి.








