ఆలియా భట్ టాలీవుడ్ ప్లాన్ అదిరిపోయింది.. ఒకేసారి రెండు భారీ ప్రాజెక్ట్స్?
బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ఆలియా భట్(Alia Bhatt) టాలీవుడ్లో మరోసారి సందడి చేయబోతుందనే వార్త ఇప్పుడు సినీ వర్గాల్లో ఇంట్రెస్టింగ్ డిస్కషన్‌కు దారితీసింది. ఇప్పటికే రాజమౌళి(Rajamouli) దర్శకత్వంలో వచ్చిన ఆర్ఆర్ఆర్(RRR) తో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన ఆలియా, ఆ తర్వాత మరిన్ని తెలుగు సినిమాలు చేయాలనే ఆసక్తి చూపుతున్నట్లు వార్తలు వచ్చాయి. ప్రస్తుతం ఆమె చేతిలో పలు భారీ హిందీ ప్రాజెక్టులుండగా, కల్కి 2898AD(Kalki 2898AD) సీక్వెల్లో దీపికా పదుకొణె(Deepika Padukone) స్థానంలో ఆలియా భట్(Alia Bhatt) నటించబోతుందనే ప్రచారం కూడా జోరుగా సాగుతోంది. అయితే దీనిపై చిత్ర బృందం నుంచి ఇప్పటివరకు అఫీషియల్ కన్ఫర్మేషన్ రావాల్సి ఉంది.
ఇదిలా ఉంటే ఇప్పుడు ఎన్టీఆర్(NTR) హీరోగా ప్రశాంత్ నీల్(Prasanth Neel) తెరకెక్కిస్తున్న ప్రతిష్టాత్మక సినిమా డ్రాగన్(Dragon) లో ఆలియా భట్ కీలక పాత్ర పోషించబోతుందనే కొత్త ప్రచారం తెరపైకి వచ్చింది. ఈ విషయంపై డిస్కషన్స్ చివరి దశకు చేరుకున్నాయని, త్వరలోనే మేకర్స్ నుంచి అఫీషియల్ అనౌన్స్మెంట్ వచ్చే అవకాశం ఉందని సినీ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. ఈ వార్త నిజమైతే ఆలియా భట్ ఒకేసారి టాలీవుడ్లో తెరకెక్కుతున్న అత్యంత భారీ, క్రేజీ ప్రాజెక్టుల్లో భాగం కానుంది.
భారీ బడ్జెట్‌తో రూపొందుతున్న డ్రాగన్ షూటింగ్ ఈ నెలలో మళ్లీ ప్రారంభం కానుండగా, సినిమాను 2027 జూన్‌లో ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ చేయాలని మేకర్స్ టార్గెట్‌గా పెట్టుకున్నట్లు సమాచారం. మరోవైపు ప్రభాస్ ప్రస్తుతం ఫౌజీ(Fauzi), స్పిరిట్(Spirit) సినిమాలతో బిజీగా ఉండటంతో కల్కి 2898AD సీక్వెల్ షూటింగ్ మరింత ఆలస్యంగా ప్రారంభం కానుంది. దీంతో ఆలియా భట్ టాలీవుడ్ ఎంట్రీపై వస్తున్న ఈ రెండు భారీ ప్రాజెక్టుల వార్తలు అభిమానుల్లో భారీ ఆసక్తిని పెంచుతున్నాయి.








