బిగ్ బాస్ 10లోకి ఎంట్రీ ఇవ్వబోయే సెలబ్రిటీలు వీరేనా?
తెలుగు బుల్లితెర ప్రేక్షకులను ఎన్నో ఏళ్లుగా అలరిస్తున్న అతిపెద్ద రియాలిటీ షోలలో బిగ్ బాస్(Bigg Boss) తెలుగు ఒకటి. ప్రతి సీజన్‌తో కొత్త కాన్సెప్ట్‌లు, ఊహించని టాస్కులు, ఇంట్రెస్టింగ్ కంటెస్టెంట్లతో ఆడియన్స్ లో క్యూరియాసిటీ పెంచుతున్న ఈ షో ఇప్పుడు పదో సీజన్‌కు రెడీ అవుతోంది. ఈసారి కూడా సెలబ్రిటీలతో పాటు సామాన్యులకు కూడా బిగ్ బాస్ హౌస్‌లోకి అడుగుపెట్టే అవకాశం ఉంది. దీంతో గత సీజన్ల కంటే ఈసారి ఎంటర్టైన్మెంట్ మరింత విభిన్నంగా ఉండబోతోందనే అంచనాలు నెలకొన్నాయి.
ఇప్పటికే కొత్త సీజన్లో పాల్గొనే అవకాశం ఉన్న సెలబ్రిటీల పేర్లు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారాయి. తాజా సమాచారం ప్రకారం జబర్దస్త్ రామ్ ప్రసాద్(ram prasad), నరేష్(naresh), యాక్టర్ కృష్ణుడు(Krishnudu), చైత్ర రాజ్(Chaitra raj), ముఖేష్ గౌడ(Mukesh gowda), అదితి ఈశ్వరన్(Aditi Eswaran) వంటి పేర్లు కంటెస్టెంట్ల లిస్ట్ లో వినిపిస్తున్నాయి. అయితే వీరిలో ఎవరు నిజంగా బిగ్ బాస్ హౌస్‌లోకి వెళ్లనున్నారనే విషయంపై అఫీషియల్ కన్ఫర్మేషన్ రావాల్సి ఉంది. ప్రతిసారి మాదిరిగానే ఈసారి కూడా చివరి నిమిషం వరకు కంటెస్టెంట్ల ఎంపికపై ఉత్కంఠ కొనసాగుతోంది.
ఇక బిగ్ బాస్ తెలుగు సీజన్ 10 సెప్టెంబర్ 6న గ్రాండ్‌గా మొదలు కానుంది. గత సీజన్లకు సక్సెస్ఫుల్ గా హోస్ట్ గా వ్యవహరించిన కింగ్ నాగార్జున(nagarjuna) మరోసారి హోస్ట్‌గా ప్రేక్షకులను పలకరించనున్నారు. కొత్త ఫేసెస్, సెలబ్రిటీల కలయిక, సామాన్యుల ఎంట్రీతో ఈ సీజన్‌పై భారీ ఆసక్తి నెలకొంది. అఫీషియల్ గా కంటెస్టెంట్ల లిస్ట్ వెలువడిన తర్వాత బిగ్ బాస్ సందడి మరింత పెరగడం ఖాయంగా కనిపిస్తోంది.








