సంక్రాంతి బరిలో మణిరత్నం సినిమా?
మణిరత్నం(Maniratnam) దర్శకత్వంలో తెరకెక్కుతున్న కొత్త సినిమా ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. విజయ్ సేతుపతి(Vijay Sethupathi), సాయి పల్లవి(Sai Pallavi) ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ రొమాంటిక్ ఎంటర్టైనర్కు ఇంకా టైటిల్ ఫిక్స్ అవలేదు. ఇటీవల కోల్‌కతాలో కీలక షెడ్యూల్‌ను పూర్తి చేసిన చిత్రబృందం తాజాగా చెన్నైలో కొత్త షెడ్యూల్‌ను ప్రారంభించింది. ఎలాంటి పెద్ద విరామాలు లేకుండా షూటింగ్ పూర్తి చేసి సినిమాను వేగంగా ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలనే టార్గెట్‌తో మణిరత్నం టీమ్ పనిచేస్తోంది.
ప్రస్తుతం ఈ సినిమాను సంక్రాంతి 2027 కానుకగా రిలీజ్ చేయాలనే ఆలోచనలో మేకర్స్ ఉన్నట్లు సమాచారం. షూటింగ్ పూర్తైన తర్వాతే టైటిల్‌తో పాటు రిలీజ్ డేట్‌పై అఫీషియల్ అనౌన్స్మెంట్ వచ్చే అవకాశముంది. మణిరత్నం సొంత నిర్మాణ సంస్థ మద్రాస్ టాకీస్(Madras Talkies) ఈ సినిమాను నిర్మిస్తోంది. లిమిటెడ్ బడ్జెట్‌తో, తక్కువ వర్కింగ్ డేస్‌లో ప్లానింగ్ ప్రకారం సినిమాను పూర్తి చేస్తున్నట్లు తెలుస్తోంది. తమిళంలో ఇప్పటికే రజనీకాంత్(rajinikanth) నటిస్తున్న ధర్మన్(Dharman) తో పాటు మరికొన్ని భారీ సినిమాలు సంక్రాంతి బరిలో నిలవడానికి సిద్ధమవుతున్నాయి.
ఇక విజయ్ సేతుపతి చేతిలో వరుస ప్రాజెక్టులున్నాయి. ఆయన ఇప్పటికే ట్రైన్(Train), స్లమ్‌డాగ్: 33 టెంపుల్ రోడ్(Slum Dog: 33 temple Road) సినిమాల షూటింగ్‌ను పూర్తి చేయగా, ఈ రెండు సినిమాలు ఈ ఏడాదే రిలీజ్ కానున్నాయి. మరోవైపు సాయి పల్లవి ప్రస్తుతం ప్రతిష్టాత్మకమైన రామాయణ(Ramayana) ప్రాజెక్టుపై ప్రత్యేక దృష్టి పెట్టింది. దీని తొలి భాగం ఈ ఏడాది దీపావళికి రిలీజ్ కానుండటంతో ఆమె కెరీర్లో కూడా ఇది కీలక సినిమాగా మారనుంది. మణిరత్నం- విజయ్ సేతుపతి- సాయి పల్లవి కాంబినేషన్‌పై ఇప్పటికే భారీ ఆసక్తి నెలకొంది.








