సీనియర్ నటుడు జీవీ నారాయణ రావు కన్నుమూత
ప్రముఖ నటుడు, నిర్మాత జీవీ నారాయణ రావు కన్నుమూశారు. ఈ విషయాన్ని నటి కరాటే కళ్యాణి సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. ఆయన మృతి పట్ల సినీ అభిమానులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. 1976లో కె. బాలచందర్ దర్శకత్వం వహించిన ‘అంతులేని కథ’ చిత్రంతో నటుడిగా పరిచయమైన ఆయన, మొదటి సినిమాకే ఉత్తమ సహాయ నటుడిగా నంది అవార్డు అందుకున్నారు. సుమారు 100 పైగా చిత్రాల్లో నటించారు. మెగాస్టార్ చిరంజీవి, సూపర్ స్టార్ రజనీకాంత్‌లతో నారాయణ రావుకు మంచి సాన్నిహిత్యం ఉంది.








