ఇరుముడి పై హైప్ ఉంది.. రవితేజ మాత్రం సైలెంట్ ఎందుకు?
రవితేజ(raviteja) హీరోగా తెరకెక్కిన ఇరుముడి(Irumudi) సినిమాపై ప్రస్తుతం ఇండస్ట్రీలోనూ, ప్రేక్షకుల్లోనూ ఆసక్తి నెలకొంది. రీసెంట్ గా రిలీజైన ట్రైలర్‌కు మంచి రెస్పాన్స్ రావడంతో సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి. అంతేకాకుండా అడ్వాన్స్ బుకింగ్స్ కూడా ఆశాజనకంగా ఉండటంతో చిత్రబృందంలో ఉత్సాహం కనిపిస్తోంది. అయితే సినిమా రిలీజ్ కు టైమ్ తక్కువ ఉన్నప్పటికీ ప్రమోషన్స్ విషయంలో మాత్రం అనుకున్న స్థాయిలో హడావుడి కనిపించడం లేదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
వరుస ఫ్లాపుల తర్వాత రవితేజకు ఇరుముడి కీలకంగా మారింది. ఇలాంటి టైమ్ లో హీరో స్వయంగా రంగంలోకి దిగి సినిమాను గట్టిగా ప్రమోట్ చేస్తే బజ్ మరింత పెరిగే అవకాశం ఉంది. ప్రీ రిలీజ్ ఈవెంట్లో పాల్గొనడంతో పాటు చిత్రబృందంతో కలిసి ఒక ఇంటర్వ్యూలో రవితేజ కనిపించారు. అయితే అక్కడితోనే ప్రమోషనల్ యాక్టివిటీస్ ఆగిపోవడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లతో ఇంటరాక్షన్స్, పాడ్‌కాస్ట్స్, మరిన్ని మీడియా ఇంటర్వ్యూలు జరిగి ఉంటే సినిమాకు అదనపు హైప్ వచ్చేదనే టాక్ వినిపిస్తోంది.
ప్రస్తుతం హీరోలు తమ సినిమాల ప్రమోషన్స్‌ను చాలా విభిన్నంగా ప్లాన్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇరుముడి విషయంలో రవితేజ మరింత యాక్టివ్‌గా ఉంటే ఓపెనింగ్స్‌పై కూడా ప్రభావం చూపే అవకాశం ఉండేది. అయితే ట్రైలర్‌కు వచ్చిన పాజిటివ్ రెస్పాన్స్ సినిమాకు ప్రధాన బలంగా మారింది. శివ నిర్వాణ(Shiva Nirvana) దర్శకత్వం వహించిన ఈ సినిమా ఆగస్టు 21న ప్రేక్షకుల ముందుకు రానుంది. మైత్రీ మూవీ మేకర్స్(Mythri movie makers) నిర్మించిన ఈ సినిమా ఇప్పుడు బాక్సాఫీస్ ఫలితంపైనే అందరి దృష్టి ఉంది.








