సంగీత్ శోభన్, ప్రణయ్ రావు, సాహు గారపాటి, శ్రీమతి అర్చన, షైన్ స్క్రీన్స్ మిస్టరీ థ్రిల్లర్ కామెడీ ఎంటర్టైనర్ అనౌన్స్మెంట్
సక్సెస్ ఫుల్ నిర్మాత సాహు గారపాటి షైన్ స్క్రీన్స్ బ్యానర్ వరుసగా ఆసక్తికరమైన ప్రాజెక్ట్స్ తో సర్ప్రైజ్ చేస్తోంది. ఇటీవల మలయాళంలోకి అడుగుపెట్టి బ్లాక్‌బస్టర్ అందుకున్న ఈ సంస్థ.. విక్టరీ వెంకటేష్, నందమూరి కళ్యాణ్ రామ్, అనిల్ రావిపూడి కాంబినేషన్లో తెరకెక్కుతున్న సినిమాతో పాటు సాయి దుర్గ తేజ్ తదుపరి చిత్రాన్ని నిర్మిస్తోంది. అదే సమయంలో కంటెంట్ ఉన్న కథలకు కూడా ప్రాధాన్యత ఇస్తోంది. ఈ క్రమంలోనే తాజాగా మరో ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్‌ను అనౌన్స్ చేసింది.
ఈ సినిమాలో ప్రస్తుతం వరుస విజయాలతో దూసుకుపోతున్న టాలెంటెడ్ హీరో సంగీత్ శోభన్ లీడ్ రోల్లో నటించనున్నారు. ప్రణయ్ రావు ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. గతంలో ఆయన ‘సాహో’ సినిమాకు అసోసియేట్ డైరెక్టర్‌గా పనిచేయడంతో పాటు ‘మ్యాడ్’, ‘మ్యాడ్ స్క్వేర్’ చిత్రాలకు అడిషినల్ స్క్రీన్‌ప్లే వర్క్ చేశారు. శ్రీమతి అర్చన ఈ చిత్రాన్ని సమర్పిస్తున్నారు.
షైన్ స్క్రీన్స్ ప్రొడక్షన్ నంబర్ 15గా తెరకెక్కుతున్న ఈ సినిమా.. సంగీత్ శోభన్ హీరోగా నటిస్తున్న 5వ చిత్రం కావడం విశేషం. హీరో పుట్టినరోజు సందర్భంగా ఈ ప్రాజెక్ట్‌ను మేకర్స్ అనౌన్స్ చేశారు.
సంగీత్ శోభన్‌ను ఇప్పటివరకు చూడని కొత్త తరహా పాత్రలో చూపించబోతున్న ఈ సినిమాకు ప్రణయ్ రావు ఆసక్తికరమైన కథను సిద్ధం చేశారు.సంగీత్ శోభన్ బాడీ లాంగ్వేజ్, యాక్టింగ్ స్టైల్‌కు తగ్గట్టుగా ఈ కథను డిజైన్ చేశారు. మిస్టరీ థ్రిల్లర్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో కామెడీ కూడా కీలకంగా ఉండనుంది. సస్పెన్స్, ఊహించని ట్విస్టులు, ఆసక్తికరమైన సన్నివేశాలతో థియేటర్లలో మంచి ఎక్స్పీరియన్స్ ఇచ్చేలా సినిమాను రూపొందిస్తున్నారు.
ప్రస్తుతం సినిమా ప్రీ-ప్రొడక్షన్ పనులు వేగంగా జరుగుతున్నాయి. త్వరలోనే రెగ్యులర్ షూటింగ్ ప్రారంభించేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. సినిమాలో నటించే ఇతర నటీనటులు, టెక్నికల్ టీమ్ వివరాలను త్వరలోనే వెల్లడించనున్నారు.
ఫ్రెష్ టాలెంట్, ఇంట్రెస్టింగ్ జానర్, సంగీత్ శోభన్ లీడ్ రోల్, షైన్ స్క్రీన్స్ నిర్మాణం.. ఈ కాంబినేషన్ అనౌన్స్మెంట్తోనే సినిమాపై క్యూరియాసిటీ పెంచింది.








