సాంప్రదాయ లుక్ లో మెరిసిపోతున్న శ్రీలీల
టాలీవుడ్ లో మోస్ట్ హ్యాపెనింగ్ హీరోయిన్ గా పేరు తెచ్చుకున్న శ్రీలీల(Sree Leela) ప్రస్తుతం పలు సినిమాలతో బిజీగా ఉంది. ఓ వైపు కెరీర్ లో సినిమాలు చేస్తూ బిజీగా ఉంటూనే మరోవైపు సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ ఎప్పటికప్పుడు తన అప్డేట్స్ను షేర్ చేస్తూ ఉంటుంది. అందులో భాగంగానే తాజాగా శ్రీలీల షేర్ చేసిన ఫోటోలు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఈ ఫోటోల్లో శ్రీలీల క్రీమ్ అండ్ ఐవరీ గోల్డ్ కాంబినేషన్ లో ఉన్న ట్రెడిషనల్ దుస్తుల్ని ధరించి దానికి మ్యాచింగ్ నెట్ దుపట్టా, రాయల్ జ్యువెలరీతో పెయిరప్ చేసి క్వీన్ లాగా మెరిసిపోతూ కనిపించగా, నెటిజన్లు ఆ ఫోటోలకు లైకులు కొడుతూ వాటిని షేర్ చేస్తున్నారు.








