RC17 హీరోయిన్గా సారా అర్జున్?
రంగస్థలం(rangasthalam) వంటి బ్లాక్‌బస్టర్ తర్వాత రామ్‌చరణ్(ram charan), సుకుమార్(sukumar) మరోసారి కలిసి పనిచేస్తున్న RC17పై అంచనాలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ దశలో ఉన్న ఈ ప్రాజెక్ట్ హీరోయిన్ విషయంలో మాత్రం ఆసక్తికరమైన డిస్కషన్ నడుస్తోంది. ఇప్పటివరకు కియారా అద్వానీ(Kiara Advani), రష్మిక మందన్నా(Rashmika Mandanna), రుక్మిణీ వసంత్(Rukmini Vasanth) వంటి పేర్లు వినిపించగా.. తాజాగా దురంధర్(Durandhar)తో ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించిన సారా అర్జున్(Sara Arjun) పేరు తెరపైకి వచ్చింది. ఈ సినిమాకు ఆమెను హీరోయిన్గా దాదాపు ఫిక్స్ చేసినట్లు ఫిల్మ్ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.
చైల్డ్ ఆర్టిస్ట్‌గా కెరీర్‌ను మొదలుపెట్టిన సారా అర్జున్ ఇప్పటికే పలు భాషల్లో గుర్తింపు తెచ్చుకుంది. దురంధర్తో ఆమెకు మరింత క్రేజ్ రావడంతో, ఇప్పుడు భారీ స్థాయి తెలుగు ప్రాజెక్ట్‌లో అవకాశం దక్కిందనే వార్త ప్రాధాన్యం సంతరించుకుంది. అయితే సారా ఎంపికపై మేకర్స్ నుంచి ఇప్పటివరకు ఎలాంటి అఫీషియల్ అనౌన్స్మెంట్ రాలేదు. దీంతో ప్రస్తుతం వినిపిస్తున్న వార్తలను అధికారికంగా ధ్రువీకరించాల్సి ఉంది. వచ్చే నెలలో ప్రాజెక్ట్‌కు సంబంధించిన పూజా కార్యక్రమాలు నిర్వహించి, తర్వాత అనౌన్స్మెంట్ చేసే అవకాశం ఉందని తెలుస్తోంది.
ఇక RC17ను మైత్రీ మూవీ మేకర్స్(Mythri movie makers) భారీ స్థాయిలో నిర్మించనుండగా, దేవిశ్రీ ప్రసాద్(Devi Sri Prasad) మ్యూజిక్ అందించనున్నట్లు సమాచారం. హై ఓల్టేజ్ స్టైలిష్ ఎంటర్టైనర్గా రూపొందనున్న ఈ సినిమాకు స్క్రిప్ట్ వర్క్స్ ఇప్పటికే ముందుకు వెళ్లినట్లు టాక్. చరణ్ క్యారెక్టర్ కోసం లుక్, ఫిజిక్‌లో మార్పులు చేయనున్నారనే ప్రచారం కూడా ఉంది. సెప్టెంబర్‌లో లాంఛనంగా ప్రారంభించి, నవంబర్ నుంచి రెగ్యులర్ షూటింగ్‌కు వెళ్లే ఆలోచనలో మేకర్స్ ఉన్నట్లు తెలుస్తోంది. సారా అర్జున్ పేరు నిజంగానే ఫైనల్ అయితే.. రంగస్థలం తర్వాత వస్తున్న ఈ కాంబినేషన్లో ఆమె సెలెక్షన్ సినిమాపై మరో ఇంట్రెస్టింగ్ డిస్కషన్‌కు దారితీయడం ఖాయం.








