స్పిరిట్ జూన్‌కు వాయిదా అంటూ బాలీవుడ్లో ప్రచారం
ప్రభాస్(prabhas), సందీప్ రెడ్డి వంగా(sandeep reddy vanga) కాంబినేషన్లో తెరకెక్కుతున్న స్పిరిట్(Spirit) సినిమాపై మరోసారి రిలీజ్ డేట్ డిస్కషన్ మొదలైంది. 2027 మార్చిలో ఈ సినిమాను ఆడియన్స్ ముందుకు తీసుకురావాలనే ఆలోచనలో చిత్రబృందం ఉన్నట్లు ఇంతకాలం ప్రచారం సాగుతుండగా, తాజాగా జూన్‌కు వాయిదా పడే అవకాశం ఉందంటూ బాలీవుడ్ వర్గాల్లో వార్తలు వినిపిస్తున్నాయి. మరోవైపు సల్మాన్ ఖాన్(salman Khan), వంశీ పైడిపల్లి(vamshi Paidipally) కాంబినేషన్లో రూపొందుతున్న సినిమాను ఈద్ సందర్భంగా మార్చి 9 లేదా 10న సోలోగా రిలీజ్ చేసే ఆలోచన ఉందనే వార్తలు కూడా ఈ డిస్కషన్‌కు మరింత బలాన్ని చేకూరుస్తున్నాయి.
అయితే స్పిరిట్ పనితీరును గమనిస్తే వాయిదా వార్తలు ఫ్యాన్స్ కు కొంత ఆశ్చర్యాన్ని కలిగిస్తున్నాయి. ఇటీవలే ఒక కీలక షూటింగ్ షెడ్యూల్‌ను పూర్తి చేసిన ప్రభాస్, ప్రస్తుతం హను రాఘవపూడి(hanu raghavapudi) దర్శకత్వంలోని ఫౌజీ(Fauzi) సినిమాకు సంబంధించిన నెల రోజుల షెడ్యూల్లో పాల్గొంటున్నారు. ఈ షెడ్యూల్ పూర్తైన తర్వాత ఆయన తిరిగి స్పిరిట్ సెట్స్‌లోకి వెళ్లి వరుసగా జరిగే కీలక షెడ్యూళ్లలో పాల్గొననున్నట్లు తెలుస్తోంది. దీంతో ప్రొడక్షన్ వర్క్స్ వేగంగా జరుగుతున్న టైమ్ లోరిలీజ్ వాయిదా ప్రచారం తెరపైకి రావడం ఆసక్తిని రేకెత్తిస్తోంది.
ప్రస్తుతం జూన్ 2027 రిలీజ్‌పై మేకర్స్ నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. అందువల్ల తాజా ప్రచారాన్ని ఫిక్డ్స్ డెసిషన్ గా చూడాల్సిన అవసరం లేదు. అయినప్పటికీ బాలీవుడ్ మీడియా నుంచి వస్తున్న వరుస కథనాలు ప్రభాస్ ఫ్యాన్స్ లో డౌట్స్ ను పెంచుతున్నాయి. ఈ నేపథ్యంలో డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా నుంచి ఒక చిన్న క్లారిటీ వచ్చినా ప్రస్తుతం నెలకొన్న గందరగోళానికి తెరపడే అవకాశం ఉంది. రిలీజ్ విషయంలో ఫైనల్ డెసిషన్ ఎప్పుడు, ఎలా ఉంటుందనేది అఫీషియల్ అనౌన్స్మెంట్ వచ్చే వరకు ఆసక్తికరంగానే మారింది.








