అవారపన్ 2తో దిశా పటానీకి మళ్లీ ఊపిరి
బాక్సాఫీస్ వద్ద మంచి సక్సెస్‌ను అందుకుంటున్న అవారపన్2(awarapan2).. ఇమ్రాన్ హష్మీ(Emraan Hashmi)కి మాత్రమే కాకుండా హీరోయిన్ దిశా పటానీ(disha pathani)కి కూడా కొత్త ఆశలు కల్పిస్తోంది. సన్నీ డియోల్(sunny Deol) బట్వారా 1947(Batwaara1947)తో పోటీ నేపథ్యంలో ఈ సినిమాకు పెద్దగా అవకాశాలు లేవని చాలామంది భావించినా.. రిజల్ట్ మాత్రం దానికి భిన్నంగా వచ్చింది. ముఖ్యంగా దిశా పటానీకి ఈ సినిమా కెరీర్లో కీలకమైన మలుపుగా మారింది. 2018లో వచ్చిన బాఘీ2(baaghi2) తర్వాత ఆమెకు చెప్పుకోదగ్గ బ్లాక్‌బస్టర్ దక్కలేదు. భారత్(Bhaarat), మలంగ్(malang), రాధే(Radhe), ఏక్ విలన్ రిటర్న్స్(Ek Villain Returns), యోధా(Yodha), వెల్కమ్ టు ది జంగిల్(welcome to the jungle) వంటి సినిమాలు ఆమె కెరీర్‌కు ఆశించిన స్థాయిలో బూస్ట్ ఇవ్వలేకపోయాయి.
మధ్యలో ప్రభాస్(prabhas) తో నటించిన కల్కి 2898 ఏడీ(Kalki2898AD) భారీ సక్సెస్‌ను అందుకున్నప్పటికీ.. అందులో దిశా క్యారెక్టర్ లిమిటెడ్ గానే ఉండటంతో ఆ సక్సెస్ పూర్తిగా ఆమె అకౌంట్ లోకి రాలేదు. కానీ అవారపన్2 విషయంలో పరిస్థితి భిన్నంగా కనిపిస్తోంది. ఈ సినిమాలో దిశా యాక్టింగ్ పై ఆడియన్స్, విమర్శకుల నుంచి మిక్డ్స్ రెస్పాన్స్ వచ్చినప్పటికీ.. ఆమె స్క్రీన్ ప్రెజెన్స్ మాత్రం మరోసారి చర్చనీయాంశంగా మారింది. ముఖ్యంగా గ్లామర్‌తో పాటు కథలో తన పాత్రకు మరింత ప్రాధాన్యం దక్కితే దిశా కెరీర్లో కొత్త దశ మొదలవుతుందని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.
ఇప్పటివరకు గ్లామర్ ఇమేజ్‌తో యూత్‌లో భారీ ఫాలోయింగ్ సంపాదించుకున్న దిశా.. ఇకపై సినిమాల ఎంపికలో మరింత జాగ్రత్త వహించాల్సిన అవసరం ఉందనే డిస్కషన్ మొదలైంది. ఆమె గ్లామర్‌ను సరిగ్గా వినియోగించడంతో పాటు యాక్టింగ్ లోని మరో కోణాన్ని బయటకు తీసుకురాగల డైరెక్టర్ దొరికితే కెరీర్‌కు మరింత బలమైన పునాది ఏర్పడే అవకాశం ఉంది. ప్రస్తుతం దిశా తర్వాతి సినిమా అఫీషియల్ గా అనౌన్స్ చేయబడలేదు. అవారపన్ 2తో వచ్చిన ఈ క్రేజ్‌ను ఆమె తదుపరి ప్రాజెక్ట్ ఎంతవరకు కొనసాగిస్తుందన్నదే ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.








