మోక్షజ్ఞ డెబ్యూపై భారీ అప్డేట్.. డైరెక్టర్ ఎవరంటే?
నందమూరి మోక్షజ్ఞ(Nandamuri Mokshagna) సినీ ఎంట్రీపై చాలాకాలంగా కొనసాగుతున్న ఉత్కంఠకు త్వరలోనే తెరపడే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే పలువురు డైరెక్టర్ల పేర్లు తెరపైకి వచ్చినప్పటికీ, ఏ ప్రాజెక్ట్ కూడా అనుకున్న స్థాయిలో ముందుకు సాగలేదు. అయితే తాజాగా విశ్వంభర(Vishwambhara) ఫేమ్ వశిష్ట(Vassishta) దర్శకత్వంలో మోక్షజ్ఞను హీరోగా పరిచయం చేసే సినిమాకు రంగం సిద్ధమైనట్లు సినీ వర్గాల్లో డిస్కషన్ జరుగుతోంది. ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించిన కథ కూడా సిద్ధమైనట్లు, ప్రస్తుతం అఫీషియల్ అనౌన్స్మెంట్ కు సంబంధించిన ఏర్పాట్లు జరుగుతున్నట్లు సమాచారం.
మోక్షజ్ఞ డెబ్యూ విషయంలో గతంలో ప్రశాంత్ వర్మ(Prasanth Varma)తో సినిమా ఉంటుందని అధికారికంగా ప్రకటించారు. అయితే కొన్ని కారణాల వల్ల ఆ ప్రాజెక్ట్ ఆగిపోయింది. అనంతరం క్రిష్(Krish) దర్శకత్వంలో సినిమా ఉంటుందనే ప్రచారం సాగింది. ఆదిత్య చోప్రా(Aditya Chopra) నిర్మించిన ఓ సినిమాను రీమేక్ చేసే ఆలోచనతో పాటు ఆదిత్య 999(Aditya999) ప్రాజెక్ట్ కూడా డిస్కషన్స్‌లోకి వచ్చింది. కానీ ఇవేవీ కార్యరూపం దాల్చలేదు. దీంతో మోక్షజ్ఞ తొలి సినిమా ఎవరితో ఉంటుందనే ఆసక్తి అభిమానుల్లో కొనసాగుతూనే ఉంది.
ఇప్పుడు వశిష్టతో ప్రాజెక్ట్ దాదాపు ఖరారైనట్లు వస్తున్న సమాచారం ఆ ఆసక్తిని మరింత పెంచుతోంది. మోక్షజ్ఞను తెరపైకి తీసుకొచ్చే విషయంలో బాలకృష్ణ(Balakrishna) కథ, డైరెక్టర్ సెలెక్షన్ పై ప్రత్యేక దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. బాలయ్యకు ఇటీవల ఎదురైన ఆరోగ్య సమస్యలు, ఆయన ఇతర కమిట్మెంట్స్ కారణంగా అనౌన్స్మెంట్ లో ఆలస్యం జరిగినట్లు టాక్ వినిపిస్తోంది. పరిస్థితులు అనుకూలిస్తే దసరా సందర్భంగా సినిమాను లాంఛనంగా ప్రారంభించి, మోక్షజ్ఞ సినీ రంగ ప్రవేశంపై అధికారికంగా క్లారిటీ ఇచ్చే అవకాశం ఉందని సమాచారం.








