రజినీ మూవీలో రాపో?
కోలీవుడ్ సూపర్‌స్టార్ రజనీకాంత్(rajinikanth) హీరోగా తెరకెక్కుతున్న ప్రతిష్ఠాత్మక సినిమా ధర్మన్ (Dharman) పై ప్రేక్షకుల్లో ఆసక్తి రోజురోజుకూ పెరుగుతోంది. కమల్‌హాసన్(Kamal Haasan), ఆర్. మహేంద్రన్ (R. Mahendran) నిర్మిస్తున్న ఈ సినిమాకు అశ్వత్ మారిముత్తు(Aswath Marimuthu) దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటికే రిలీజైన ఫస్ట్‌లుక్‌లో రజనీకాంత్ డాక్టర్ పాత్రలో కనిపించడం సినిమాపై మరింత క్యూరియాసిటీని పెంచింది. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ శరవేగంగా కొనసాగుతున్నట్లు సమాచారం.
ఇదిలా ఉంటే.. ధర్మన్ మూవీకు సంబంధించి తాజాగా ఓ ఇంట్రెస్టింగ్ కాస్టింగ్ న్యూస్ ఇండస్ట్రీ వర్గాల్లో చక్కర్లు కొడుతోంది. ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని ఈ ప్రాజెక్ట్‌లో భాగం కానున్నారని టాక్ వినిపిస్తోంది. అయితే ఇది కేవలం గెస్ట్ రోల్ మాత్రమే కాదని, కథలో కీలకమైన మలుపులతో ముడిపడి ఉండే ప్రాధాన్యత కలిగిన క్యారెక్టర్లో రామ్ కనిపించనున్నారని సమాచారం. ఆయన క్యారెక్టర్ లెంగ్త్ కూడా రెగ్యులర్ క్యామియో కంటే ఎక్కువగా ఉండనుందని తెలుస్తోంది.
రజనీకాంత్, రామ్ పోతినేని ఒకే సినిమాలో కనిపించనున్నారనే వార్త సహజంగానే అభిమానుల్లో ఆసక్తిని పెంచుతోంది. కథలో వీరిద్దరి పాత్రలకు ఎలాంటి సంబంధం ఉంటుంది? రామ్ క్యారెక్టర్ కథను ఏ స్థాయిలో ప్రభావితం చేస్తుంది? అనే అంశాలపై ఇప్పుడు డిస్కషన్ మొదలైంది. మరోవైపు రామ్ పోతినేని RAPO23తో డైరెక్టర్‌గానూ కొత్త ప్రయాణాన్ని ప్రారంభిస్తున్నారు. ఈ నేపథ్యంలో ధర్మన్ లో ఆయనకు లభించనున్న క్యారెక్టర్ నిజమైతే.. ఆయన కెరీర్లో ఇది మరో ప్రత్యేకమైన ప్రాజెక్ట్‌గా నిలిచే అవకాశం ఉంది.








