విల్ స్మిత్ ఎంట్రీతో రాకాలో మరో హాలీవుడ్ ట్విస్ట్?
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్(allu arjun), డైరెక్టర్ అట్లీ(Atlee) కాంబినేషన్లో తెరకెక్కుతున్న భారీ ప్రాజెక్ట్ రాకా(Raaka)పై అంచనాలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్‌తో రూపొందుతున్న ఈ సినిమాను రెండు భాగాలుగా తెరకెక్కిస్తున్నట్టు ఇప్పటికే టాక్ ఉంది. ఈ ప్రాజెక్ట్‌పై మొదటి నుంచీ భారీ స్థాయిలో అంచనాలు ఉండటానికి అట్లీ ప్లానింగ్‌తో పాటు సినిమాకు సంబంధించిన పలు ఆసక్తికరమైన వార్తలు కూడా కారణంగా నిలుస్తున్నాయి. ముఖ్యంగా ఈ కథ అల్లు అర్జున్ కంటే ముందు పలువురు స్టార్ హీరోల వద్దకు వెళ్లిందనే ప్రచారం అప్పట్లో జరిగింది.
ఇదే సమయంలో హాలీవుడ్ స్టార్ విల్ స్మిత్‌ను కూడా ఈ ప్రాజెక్ట్‌లో భాగం చేయాలని అట్లీ భావిస్తున్నారనే వార్తలు గతంలో సోషల్ మీడియాలో హల్చల్ చేశాయి. అయితే ఆ తర్వాత ప్రాజెక్ట్ అల్లు అర్జున్ చేతుల్లోకి రావడంతో ఆ ప్రచారం క్రమంగా మరుగున పడింది. ఇప్పుడు మరోసారి విల్ స్మిత్(Will Smith) పేరు రాకాతో ముడిపడి వినిపించడం ఆసక్తిని పెంచుతోంది. సినిమాలో ఆయన కీలక పాత్రలో కనిపించనున్నారనే రూమర్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.
అయితే ఈ వార్తకు సంబంధించి మేకర్స్ నుంచి ఇప్పటివరకు ఎలాంటి అఫీషియల్ అనౌన్స్మెంట్ రాలేదు. గతంలోనూ ఇదే తరహా ప్రచారం జరగడంతో తాజా రూమర్స్‌ను ఎంతవరకు విశ్వసించాలనేది ఆసక్తికరంగా మారింది. ఒకవేళ విల్ స్మిత్ నిజంగానే రాకాలో భాగమైతే, అల్లు అర్జున్‌కు ఇది హాలీవుడ్ స్థాయిలో మరింత గుర్తింపు తెచ్చే కీలక అడుగుగా మారే అవకాశం ఉంది. అట్లీ, సన్ పిక్చర్స్(Sun Pictures) టీమ్ ఈ భారీ ప్రాజెక్ట్ కోసం ఎలాంటి సర్ప్రైజ్లు సిద్ధం చేశారో అధికారిక ప్రకటన వచ్చే వరకు వేచి చూడాల్సిందే.








