Tiger Shroff: సునీల్ శెట్టి ఎంట్రీతో టైగర్ సినిమాకు హైప్
టైగర్ ష్రాఫ్(Tiger Shroff) హీరోగా తెరకెక్కుతున్న కొత్త ప్రాజెక్ట్ మళ్లీ ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారింది. నిర్మాత మురద్ ఖేతానీ(murad khethani) బ్యానర్లో రూపొందుతున్న ఈ సినిమా వచ్చే నెలలో సెట్స్ పైకి వెళ్లడానికి సిద్ధమవుతోంది. ముంబైలో స్పెషల్ గా వేసిన భారీ సెట్స్‌పై షూటింగ్ జరగనుండగా, టీమ్ ఫాస్ట్ ట్రాక్ ప్లానింగ్‌తో జూలై నాటికి షూటింగ్ పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. ప్రొడక్షన్ స్కేల్, ప్లానింగ్ చూస్తే మేకర్స్ ఈ ప్రాజెక్ట్‌పై ఎంత నమ్మకంతో ఉన్నారో స్పష్టమవుతోంది.
ఇక ఈ సినిమాకు కొత్త ఆకర్షణగా సునీల్ శెట్టి(Suniel Shetty) ఎంట్రీ ఇవ్వడం ఆసక్తిని పెంచింది. ఆయన పాత్రపై ఇంకా అధికారిక ప్రకటన లేకపోయినా, కథలో కీలక మలుపు తీసుకువచ్చే పాత్రలో కనిపించే అవకాశం ఉందని టాక్. ఇదే సమయంలో టైగర్ రెమ్యూనరేషన్ మరో చర్చగా మారింది. అతను ఒక్కో సినిమాకు సుమారు రూ.40 కోట్లు తీసుకుంటున్నారని ట్రేడ్ వర్గాలు చెబుతున్న నేపథ్యంలో, ఇటీవల ఆయన సినిమాల ఓపెనింగ్స్ ఆశించిన స్థాయిలో లేకపోవడం నిర్మాతలపై ఒత్తిడిని పెంచుతోందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
బాక్సాఫీస్ పరంగా టైగర్ ఇటీవల ట్రాక్ రికార్డ్ అంతగా బలంగా లేకపోవడం కూడా ఈ ప్రాజెక్ట్‌కు కీలకంగా మారింది. కరోనా తర్వాత యాక్షన్ సినిమాలపై ప్రేక్షకుల అభిరుచి మారిందని విశ్లేషకులు చెబుతున్నారు. కేవలం యాక్షన్ కాకుండా బలమైన కథ, కొత్తదనం అవసరమనే డిమాండ్ పెరిగింది. ఈ నేపథ్యంలో ఈ సినిమా టైగర్‌కు కంబ్యాక్‌గా నిలుస్తుందా అన్నది ఆసక్తికరంగా మారింది. డిసెంబర్ రిలీజ్ టార్గెట్‌తో ముందుకెళ్తున్న ఈ సినిమా షెడ్యూల్ ప్రకారం పూర్తి అయితే, హాలిడే సీజన్లో మంచి వసూళ్లు సాధించే అవకాశం ఉంది.
ఇవి కూడా చదవండి








