రాకా కోసం మరింత వెయిటింగ్ తప్పదా?
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్(Allu arjun) మరియు స్టార్ డైరెక్టర్ అట్లీ(Atlee) కాంబినేషన్లో తెరకెక్కుతున్న భారీ పాన్ ఇండియా ప్రాజెక్ట్ రాకా రిలీజ్ పై తాజా బజ్ ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారింది. మొదట ఈ సినిమాను 2027 ఏప్రిల్‌లో రిలీజ్ చేయాలని ప్లాన్ చేసిన మేకర్స్, ఇప్పుడు ఆ టైమ్‌లైన్ మిస్ అయ్యే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఇటీవల ముంబై సెట్స్ నుంచి అట్లీ షేర్ చేసిన ఓ క్రూ ఐడెంటిటీ ట్యాగ్ ఫోటో ఈ చర్చలకు దారితీసింది. ఆ ట్యాగ్‌పై 2027 ఏప్రిల్ వరకు వాలిడిటీ ఉన్నట్లు కనిపించడం, షూటింగ్ ఆ సమయానికి కొనసాగవచ్చనే సంకేతాలు ఇస్తోంది.
ఇదే సమయంలో, షూటింగ్ షెడ్యూల్ లేట్ కావడంతో పాటు భారీ స్థాయి పోస్ట్ ప్రొడక్షన్ కూడా విడుదల వాయిదాకు ప్రధాన కారణంగా మారినట్లు సమాచారం. హాలీవుడ్ టెక్నీషియన్స్ భాగస్వామ్యంతో రూపొందుతున్న ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులకే ఎనిమిది నెలలకు పైగా సమయం పట్టే అవకాశముందని ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో, సినిమా విడుదలను 2027 డిసెంబర్‌కు లేదా సంక్రాంతి 2028 సీజన్‌కు మార్చే ఆలోచనలో మేకర్స్ ఉన్నారని వినిపిస్తోంది.
ఇక నటుడిగా అల్లు అర్జున్ ఈ ప్రాజెక్ట్ కోసం భారీగా కష్టపడుతున్నట్లు సమాచారం. తన పాత్రకు సరిపోయే లుక్, బాడీ లాంగ్వేజ్ కోసం రోజుకు దాదాపు నాలుగు గంటలపాటు మేకప్ మరియు ప్రిపరేషన్‌కు సమయం కేటాయిస్తున్నాడని టాక్. ఇప్పటికే ఆయన బర్త్‌డే సందర్భంగా విడుదలైన ఫస్ట్ లుక్ అభిమానుల్లో ఆసక్తిని రేకెత్తించింది. భారీ బడ్జెట్, అంతర్జాతీయ స్థాయి టెక్నికల్ వర్క్‌తో రూపొందుతున్న రాకా ఒక లాంగ్ గెస్టేషన్ ప్రాజెక్ట్‌గా మారుతున్న నేపథ్యంలో, అభిమానులు మరికొంత కాలం వేచి చూడాల్సిందేనని స్పష్టమవుతోంది.








