Jailer2: జైలర్2లో షారుఖ్ క్యామియో
ఒక హీరో నటిస్తున్న సినిమాలో మరొకరు గెస్ట్ రోల్ చేయడం ఇప్పుడు చాలా కామన్ గా మారిపోయింది. తెలుగులోనే కాకుండా అన్ని భాషల్లోనూ ఈ కల్చర్ ఉంది. రీసెంట్ గా సంక్రాంతి సినిమాలు మన శంకరవరప్రసాద్ గారు(MSG)లో వెంకటేష్(venkatesh), నారీ నారీ నడుమ మురారి(NNNM) మూవీలో శ్రీ విష్ణు(Sree vishnu) గెస్టు రోల్స్ చేసి మంచి హిట్లు అందుకున్నారు. ఇక గతంలో వచ్చిన రజినీకాంత్(Rajinikanth) మూవీ జైలర్(jailer) లో గెస్ట్ రోల్స్ గురించి తెలిసిందే.
నెల్సన్ దిలీప్ కుమార్(nelson dileep kumar) దర్శకత్వంలో రజినీకాంత్ హీరోగా వచ్చిన జైలర్ మూవీలో శివ రాజ్ కుమార్(sivaraj kumar), మోహన్ లాల్(mohanlal) ప్రత్యేక పాత్రలు చేయగా, సినిమాకు ఆ పాత్రలు మంచి క్రేజ్ ను తీసుకొచ్చాయి. ఇప్పుడు జైలర్2(jailer2) లో వారిద్దరి పాత్రల నిడివి మరింత పెరగనుందని తెలుస్తోంది. ఈ ఇద్దరూ కాకుండా మరో స్టార్ హీరో కూడా జైలర్2 లో గెస్ట్ రోల్ లో కనిపించబోతున్నారని సమాచారం.
ఆయన మరెవరో కాదు, బాలీవుడ్ బాద్ షా షారుఖ్ ఖాన్(Shah rukh khan). గతంలో షారుఖ్ హీరోగా వచ్చిన రావన్(raavan) మూవీలో రజినీకాంత్ ఓ క్యామియో చేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడా బాకీని షారుఖ్, జైలర్2 రూపంలో తీర్చుకోబోతున్నారని సమాచారం. జైలర్2లో షారుఖ్ నటిస్తే ఈ సినిమాకు నార్త్ లో కూడా మంచి డిమాండ్, క్రేజ్ ఏర్పడి తద్వారా బిజినెస్ బాగా జరిగే అవకాశాలున్నాయి. మొదటి సినిమా ఆగస్టులో రిలీజైన నేపథ్యంలో ఆ సెంటిమెంట్ తోనే జైలర్2 ను కూడా ఆగస్టులో రిలీజ్ చేయడానికి మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తోంది.






