Jetli: జెట్లీ నుంచి ‘సత్య ఈజ్ నాట్ జెట్లీ’ ప్రమోషనల్ సాంగ్ రిలీజ్
టాలీవుడ్ ఫేవరేట్ ద్వయం సత్య, దర్శకుడు రితేష్ రానా ‘జెట్లీ‘ (Jetli)తో అలరించబోతున్నారు. క్లాప్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్‌పై చిరంజీవి (చెర్రీ) హేమలత పెద్దామల్లు నిర్మించిన ఈ చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్ సమర్పిస్తోంది. మిస్ యూనివర్స్ ఇండియా రియా సింఘా కథానాయికగా తెలుగు చిత్రసీమలో అరంగేట్రం చేస్తున్నారు. ఇప్పటికే ఆకట్టుకునే ఫస్ట్-లుక్ పోస్టర్లు, ఒక ఫన్ గ్లింప్స్ తో బజ్ క్రియేట్ చేసిన మేకర్స్, ఇప్పుడు సత్య ఈజ్ నాట్ జెట్లీ’ అనే ప్రమోషనల్ సాంగ్‌ను విడుదల చేశారు.
కాల భైరవ సంగీతంలో వచ్చిన ఈ ట్రాక్ ప్లే ఫుల్ ఎలక్ట్రానిక్ పల్స్‌తో ప్రారంభమై, క్రమంగా బాస్ హెవీ బీట్స్ తో ఉత్సాహంగా మారింది. లిరిసిస్ట్ సాయి సోమయాజులు తన ప్రత్యేక స్టైల్‌తో సత్యఅన్ప్రెడిక్టబుల్ పర్సనాలిటీని చమత్కారంగా ప్రతిబింబించే లైన్స్ రాశారు. శ్రావణ భార్గవి తన ఎనర్జిటిక్ వాయిస్ తో మరింత ఉత్సాహంగా మలిచారు. కొరియోగ్రాఫర్ విజయ్ పోలాకి రూపొందించిన స్టెప్స్ పాట అలరించాయి. కలర్ ఫుల్ సెట్స్ ఈ పాటకి మరింత ఆకర్షణను తీసుకువచ్చాయి.
అసలు హైలైట్ మాత్రం సత్యే. ఈ పాటలో అతను చూపించిన డాన్స్ మూవ్స్ ప్రేక్షకులను ఆశ్చర్యపరుస్తాయి. కేవలం కామెడీ యాక్టర్ మాత్రమే కాకుండా, అద్భుతమైన రిథమ్ ఉన్న డాన్సర్ గా ఆకట్టుకున్నారు. రియా సింఘా కూడా తన గ్లామర్‌తో పాటు స్టైలిష్ మూవ్స్‌తో అలరించింది.
ఈ ప్రమోషనల్ సాంగ్ ఒక స్పార్క్ ప్లగ్ లా పనిచేస్తూ సినిమాపై అంచనాలను పెంచుతుంది. ఇందులో సత్య తన కంప్లీట్ ఎంటర్టైనింగ్ అవతార్‌లో కనిపించారు.
ఈ చిత్రానికి సురేష్ సారంగం సినిమాటోగ్రఫీ, కార్తీక శ్రీనివాస్ ఎడిటింగ్, నార్ణి శ్రీనివాస్ ప్రొడక్షన్ డిజైనర్. వీరందరూ కలిసి, రితేష్ రానా మరో విలక్షణమైన వరల్డ్ బిల్డింగ్ కి సరైన పునాది వేశారు.
మేకర్స్ త్వరలో సినిమా విడుదల తేదీని ప్రకటించనున్నారు.
ఇవి కూడా చదవండి








