Saiyaara: సైయారా ఓటీటీలోకి వచ్చేది అప్పుడేనా?
చాలా రోజుల తర్వాత బాలీవుడ్ లో సైయారా(Saiyaara) రూపంలో ఓ మంచి హిట్ దక్కింది. మోహిత్ సూరి(Mohith Suri) దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో అహాన్ పాండే(Ahan Pandey) హీరోగా నటించగా, అనీత్ పడ్డా(Aneeth Padda) హీరోయిన్ గా నటించింది. ఫస్ట్ షో నుంచే పాజిటివ్ టాక్ తో దూసుకెళ్తున్న సైయారా ఇప్పటికే బాక్సాఫీస్ వద్ద రూ.400 కోట్ల మార్క్ ను క్రాస్ చేసింది.
ఇప్పటికీ స్ట్రాంగ్ రన్, మంచి బుకింగ్స్ తో దూసుకెళ్తున్న సైయారా మరో రెండు వారాల పాటూ ఎలాంటి ఢోకా లేకుండా కంటిన్యూ అయ్యే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి. బాక్సాఫీస్ వద్ద సక్సెస్ఫుల్ గా రన్ అవుతున్న ఈ సినిమా ఓటీటీ రిలీజ్ పై ఇప్పుడు బాలీవుడ్ వర్గాల్లో ఓ న్యూస్ వినిపిస్తోంది. బజ్ ప్రకారం సైయారా సెప్టెంబర్ 12 నుంచి ఓటీటీలోకి వస్తుందని తెలుస్తోంది.
సైయారా సినిమా డిజిటల్ హక్కులను ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ఫ్లిక్స్(Netflix) సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. సెప్టెంబర్ 12న సైయారా ఓటీటీలోకి వస్తున్నప్పటికీ అందులో కేవలం హిందీలో మాత్రమే స్ట్రీమింగ్ కు వస్తుందని తెలుస్తోంది. అయితే ఇవన్నీ సోషల్ మీడియాలో వస్తున్న వార్తలే తప్పించి, సైయారా ఓటీటీ రిలీజ్ గురించి ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటనా వచ్చింది లేదు.













