పింక్ డ్రెస్ లో రుహానీ గ్లామర్ ట్రీట్
రుహానీ శర్మ(Ruhani Sharma) తెలుగు ప్రేక్షకులకు సుపరిచితురాలే. చిలసౌ(Chilasow) సినిమాతో టాలీవుడ్ కు పరిచయమైన ఈ భామ మొదటి సినిమాతోనే నటిగా మంచి మార్కులేసుకుంది. ఓ వైపు సినిమాలు, సిరీస్లు చేస్తూ కెరీర్లో బిజీగా ఉంటూనే మరోవైపు సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ, ఎప్పటికప్పుడు తన అప్డేట్స్ ను షేర్ చేస్తూ ఉంటుంది. అందులో భాగంగానే తాజాగా రుహానీ పింక్ కలర్ టాప్, బాటమ్ లో బ్లూ కలర్ డిస్ట్రెస్డ్ జీన్స్ వేసుకుని తన అందాన్ని డబుల్ చేస్తూ ఫోటోలకు పోజులివ్వగా, ఆ ఫోటోలు చూసి కుర్రాళ్లు రుహానీ అందాలను పొగుడుతూ తెగ కామెంట్స్ చేస్తూ, వాటిని వైరల్ చేసే పనిలో బిజీగా ఉన్నారు.








