Chiranjeevi: కవల పిల్లలకు జన్మనిచ్చిన రామ్ చరణ్ ఉపాసన.. గుడ్ న్యూస్ షేర్ చేసిన చిరంజీవి
మెగా కుటుంబంలో పండుగ వాతావరణం నెలకొంది. రామ్ చరణ్ – ఉపాసన దంపతులకు జనవరి 31న కవల పిల్లలు (ఒక బాబు, ఒక పాప) జన్మించారు. ఈ విషయాన్ని చిరంజీవి సోషల్ మీడియా వేదికగా ప్రకటిస్తూ ఆనందం వ్యక్తం చేశారు. ఇప్పటికే వీరికి క్లింకార అనే కుమార్తె ఉండగా, ఇప్పుడు వారసుడు కూడా రావడంతో మెగా ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు. తల్లీ బిడ్డలు క్షేమంగా ఉన్నారని చిరంజీవి తెలిపారు. సెలబ్రిటీలు, అభిమానులు ఉపాసన దంపతులకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.మెగా ఫ్యామిలీలో సందడి నెలకొంది. రామ్ చరణ్, ఉపాసన దంపతులకు కవల పిల్లలు పుట్టారు. జనవరి 31 శుక్రవారం రాత్రి అపోలో ఆసుపత్రిలో ఓ బాబు, ఓ పాపకు జన్మనిచ్చారు. ఈ విషయాన్ని చిరంజీవి స్వయంగా సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. తల్లీ బిడ్డలు ఆరోగ్యంగా ఉన్నారని.. తమ కుటుంబంలోకి ఈ చిన్నారులు రావడం ఎంతో సంతోషం కలిగిస్తోందని, ఇది దైవాశీర్వాదమని పేర్కొన్నారు.






