Nani-Sujeeth: నాని సరసన బుట్టబొమ్మ?
నేచురల్ స్టార్ ప్రస్తుతం చాలా బిజీగా ఉన్నాడు. హిట్3(hit3) సక్సెస్ తర్వాత ది ప్యారడైజ్(Tha paradise) సినిమాతో క్షణం తీరిక లేకుండా ఉన్నాడు నాని(nani). దసరా(Dasara) ఫేమ్ శ్రీకాంత్ ఓదెల(Srikanth odela) దర్శకత్వంలో నాని ది ప్యారడైజ్ అనే సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఆల్రెడీ వీరిద్దరి కలయికలో వచ్చిన దసరా మంచి హిట్టవడంతో ప్యారడైజ్ పై అందరికీ మంచి అంచనాలున్నాయి.
ప్రస్తుతం ప్యారడైజ్ షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. మార్చి 26న రిలీజ్ అంటున్నారు కానీ షూటింగ్ వల్ల రిలీజ్ వాయిదా పడనుంది. జూన్ నాటికి సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమా తర్వాత నాని, సుజీత్(Sujeeth) దర్శకత్వంలో సినిమా చేయనున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా ఎప్పుడో అనౌన్స్ అయింది.
అయితే ఇప్పుడు నాని- సుజీత్ సినిమాకు సంబంధించిన ఓ అప్డేట్ వినిపిస్తోంది. ప్యారడైజ్ రిలీజైన వెంటనే నాని ఈ సినిమాను సెట్స్ పైకి తీసుకెళ్లనున్నాడని, జూన్ ఎండింగ్ లేదా జులై స్టార్టింగ్ లో ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ మొదలవనుందని, ఈ సినిమాలో నానికి జోడీగా టాలీవుడ్ బుట్టబొమ్మ పూజా హెగ్డే(Pooja hegde) నటించనుందని వార్తలొస్తున్నాయి. నాని- పూజా కలిసి నటించనున్న మొదటి సినిమా ఇదే కావడంతో వీరిద్దరి జంట స్క్రీన్ పై ఎలా ఉంటుందోనని చూడ్డానికి అందరూ చాలా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.






