Mrunal: అల్లు అర్జున్ సినిమా గురించి మృణాల్ క్లారిటీ
సీతారామం(sitaramam) మూవీతో టాలీవుడ్ కు పరిచయమైన మృణాల్ ఠాకూర్(mrunal thakur) ఆ మూవీలో సీతగా నటించి తెలుగు ప్రేక్షకుల గుండెల్లో సుస్థిర స్థానాన్ని సంపాదించుకుంది. సీతారామం హిట్టవడంతో మృణాల్ కు తర్వాత అవకాశాలు కూడా బాగానే వచ్చాయి కానీ తాను మాత్రం చాలా జాగ్రత్తగా సినిమాలను ఎంపిక చేసుకుంటూ కెరీర్లో ముందుకెళ్తుంది.
ప్రస్తుతం డెకాయిట్(Dacoit) మూవీలో నటిస్తున్న మృణాల్ ఠాకూర్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్(Allu arjun), అట్లీ(Atlee) కాంబినేషన్ లో రానున్న సినిమాలో ఓ హీరోయిన్ గా నటించనుందని గత కొన్నాళ్లుగా వార్తలొస్తున్నాయి. ఈ సినిమాలో దీపికా పదుకొణె(Deepika Padukone) మెయిన్ హీరోయిన్ గా నటిస్తుండగా, మరో హీరోయిన్ గా మృణాల్ కూడా కనిపించనుందని సోషల్ మీడియాలో తెగ ప్రచారం జరుగుతుంది.
దీనిపై తాజాగా మృణాల్ ను ఓ ఇంటర్వ్యూలో అడగ్గా ఆమె షాకైంది. అల్లు అర్జున్ హీరోగా తాను హీరోయిన్ గా సినిమా వస్తుందా అని ఆశ్చర్యపోయింది. నిజంగా అది జరగాలని ప్రార్థించమని, అదే జరిగితే దాన్ని సెలబ్రేట్ చేసుకుంటూ మరో ఇంటర్వ్యూ లో మాట్లాడుకుందామని చెప్పడంతో ఆ సినిమాలో మృణాల్ నటించడం లేదని అర్థమైంది. మరి బన్నీ- అట్లీ సినిమాలో దీపికా కాకుండా ఎవరు నటించనున్నారో తెలియాల్సి ఉంది.






