Maniratnam: మణిరత్నం మ్యాజిక్ ఈసారైనా జరుగుతుందా?
కోలీవుడ్‌లో గత కొంతకాలంగా చర్చనీయాంశంగా మారిన ఒక క్రేజీ కాంబినేషన్ ఇప్పుడు అఫీషియల్ గా సెట్స్ పైకి వెళ్లడానికి సిద్ధమవుతుంది. లెజెండరీ డైరెక్టర్ మణిరత్నం(maniratnam) దర్శకత్వంలో మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి(Vijay Sethupathi) హీరోగా, నేచురల్ పెర్ఫార్మర్ సాయి పల్లవి(Sai pallavi) హీరోయిన్గా నటించే ప్రాజెక్ట్‌ను మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. ఇన్నాళ్లుగా అనధికారికంగా వినిపించిన వార్తలు నిజమవడంతో సినీ వర్గాల్లోనే కాకుండా అభిమానుల్లోనూ ఈ ప్రాజెక్టుపై భారీ ఆసక్తి నెలకొంది. విభిన్నమైన కథలతో ప్రత్యేక గుర్తింపు పొందిన ఈ ముగ్గురి కలయికపై అంచనాలు ఇప్పటికే పెరిగిపోయాయి.
ఇవి కూడా చదవండి
ఈ ప్రాజెక్ట్‌ను ప్రముఖ నిర్మాణ సంస్థలు మద్రాస్ టాకీస్(Madras talkies), లైకా ప్రొడక్షన్స్(Lyca productions) సంయుక్తంగా నిర్మించనున్నట్లు వెల్లడించారు. మణిరత్నం స్టైల్‌కు తగ్గట్టుగా ఎమోషన్స్, స్ట్రాంగ్ స్క్రీన్ ప్లే, విజువల్ గ్రాండియర్ కలగలిసిన సినిమా రానుందనే టాక్ వినిపిస్తోంది. విజయ్ సేతుపతి తన యాక్టింగ్ తో కథను ముందుకు తీసుకెళ్లే సామర్థ్యం ఉన్న నటుడిగా ఇప్పటికే గుర్తింపు పొందగా, సాయి పల్లవి తన సహజ నటనతో పాత్రలకు ప్రత్యేకమైన ప్రాణం పోస్తుంది. ఈ కాంబినేషన్లో సినిమా రావడం కోలీవుడ్‌కు కొత్త ఎక్స్పీరియన్స్ అందిస్తుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
ఇదిలా ఉండగా, రీసెంట్ గా కమల్ హాసన్(kamal hassan) తో మణిరత్నం చేసిన థగ్ లైఫ్(Thug Life) సినిమా ఆశించిన స్థాయిలో ప్రేక్షకులను మెప్పించలేకపోయింది. ఈ నేపథ్యంలో ఆయన తదుపరి ప్రాజెక్ట్‌పై మరింత ఒత్తిడి ఏర్పడింది. అలాంటి పరిస్థితుల్లో ఈ క్రేజీ కాంబినేషన్ మూవీపై ఇండస్ట్రీలోనే కాకుండా ట్రేడ్ వర్గాల్లోనూ భారీ అంచనాలు నెలకొన్నాయి. మరి ఈ సినిమా ద్వారా మణిరత్నం మరోసారి తన మాజిక్‌ను రిపీట్ చేస్తారా లేదా అన్నది చూడాలి.
ఇవి కూడా చదవండి








