Maniratnam: క్రేజీ కాంబోని సెట్ చేస్తున్న మణిరత్నం?
మణిరత్నం(maniratnam)- కమల్ హాసన్(kamal hassan) కాంబినేషన్లో రూపొందిన థగ్ లైఫ్(Thug Life) ఆశించిన స్థాయిలో సక్సెస్ ను సాధించకపోవడంతో, తమిళ సినీ వర్గాల్లో మణిరత్నం నెక్ట్స్ అడుగు ఏంటనే చర్చ మొదలైంది. సోషల్ మీడియాలో విమర్శలు వినిపించినప్పటికీ, ఆయన తన శైలిని మార్చకుండా కొత్త కథపై దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. మొదట యంగ్ హీరో ధృవ్ విక్రమ్(dhruv vikram), రుక్మిణి వసంత్(rukmini vasanth) జంటగా ఓ సెన్సిటివ్ లవ్ స్టోరీని ప్లాన్ చేశారనే వార్తలు వచ్చాయి. అయితే తాజా సమాచారం ప్రకారం మణిరత్నం స్క్రిప్ట్‌ను రీ వర్క్ చేసి, మరింత ఎమోషనల్ స్ట్రెంగ్త్ ఉన్న కథను ఎంచుకున్నారని టాక్ వినిపిస్తోంది. ఇప్పుడు వినిపిస్తున్న క్రేజీ అప్డేట్ ఏమిటంటే మక్కల్ సెల్వన్ గా గుర్తింపు పొందిన విజయ్ సేతుపతి(vijay sethupati), నేచురల్ పెర్ఫార్మర్ సాయి పల్లవి(Sai pallavi) ఈ ప్రాజెక్ట్‌లో ప్రధాన పాత్రలు పోషించనున్నారట. వాస్తవానికి మణిరత్నం సినిమాలో ఎమోషన్సే ప్రధాన బలం. అలాంటి కథలో విజయ్ సేతుపతి తన నటనతో, సాయి పల్లవి తన సహజ నటనతో మరో స్థాయి మ్యాజిక్ సృష్టించే అవకాశం ఉందని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు. స్టార్ వాల్యూ కంటే కంటెంట్‌కి ప్రాధాన్యం ఇచ్చే ఈ ముగ్గురి కలయిక ఇండస్ట్రీలో ప్రత్యేకమైన చర్చకు దారి తీసింది.

ఈ సినిమాని మద్రాస్ టాకీస్(madras talkies) మురియు లైకా ప్రొడక్షన్స్(lyca productions) సంయుక్తంగా సంయుక్తంగా నిర్మించనున్నట్టు సమాచారం. అన్ని కార్యక్రమాలు అనుకున్నట్లు జరిగితే సమ్మర్ లోనే షూటింగ్ మొదలయ్యే అవకాశముంది. ప్రస్తుతం విజయ్ సేతుపతి పాకెట్ నావెల్(pocket navel)తో, సాయి పల్లవి రామాయణ(ramayana)తో బిజీగా ఉన్నారు. అన్నీ అనుకున్నట్టు జరిగితే, మణిరత్నం మరోసారి తన సిగ్నేచర్ లవ్ డ్రామాతో విమర్శలకు సమాధానం చెప్పే ప్రయత్నంలో ఉన్నారని చెప్పొచ్చు.








