Rowdy Janardhana: రౌడీ జనార్థన పై మేకర్స్ స్పెషల్ ఫోకస్
రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ(vijay devarakonda) హీరోగా తెరకెక్కుతున్న తాజా సినిమా రౌడీ జనార్దన(Rowdy janardhana)పై ఆసక్తికరమైన అప్డేట్లు వెలువడుతున్నాయి. డైరెక్టర్ రవికిరణ్ కోలా(ravikiran kola) ఈ సినిమాను విభిన్నమైన కథనంతో రూపొందిస్తున్నారని తెలుస్తోంది. ముఖ్యంగా సెకండ్ హాఫ్‌లో ఉండే ఓ స్పెషల్ ఎపిసోడ్ ఈ సినిమాకి హైలైట్ అయ్యేలా ప్లాన్ చేశాడని టాక్ వినిపిస్తోంది. ఈ ఎపిసోడ్ కోసం ప్రత్యేకంగా ఓ పాత్రను డిజైన్ చేస్తున్నట్లు సమాచారం. ముంబై స్లమ్ నేపథ్యంతో తెరకెక్కే ఈ భాగం కథలో కీలక మలుపు తిప్పనుందని చిత్ర యూనిట్ చెబుతోంది.
ఇప్పటికే ముంబైలో జరిగిన గత షెడ్యూల్లో ఈ ఎపిసోడ్‌కు సంబంధించిన కొన్ని ఇంపార్టెంట్ సీన్స్ ను షూట్ చేసినట్టు తెలుస్తోంది. రియలిస్టిక్ టచ్‌తో ఈ భాగాన్ని తెరకెక్కించేందుకు డైరెక్టర్ స్పెషల్ ఫోకస్ పెట్టారని సమాచారం. భారీ నిర్మాణ విలువలతో దిల్ రాజు(Dil raju) ఈ సినిమాను రూపొందిస్తుండగా, ఈ ప్రాజెక్ట్‌పై మేకర్స్ నమ్మకంగా ఉన్నారని టాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. ఈ సినిమా ద్వారా ప్రేక్షకులకు కొత్త అనుభూతిని అందించాలనే లక్ష్యంతో టీమ్ ముందుకు సాగుతోంది.
(adsbygoogle = window.adsbygoogle || []).push({});
కాగా ఈ సినిమాలో సీనియర్ హీరో రాజశేఖర్(rajasekhar) కీలక పాత్రలో కనిపించనున్నారు. సినిమాలో ఆయన పాత్ర, లుక్ ఇప్పటివరకు చూడని విధంగా ఉంటుందని సమాచారం, ఇప్పటికే లుక్ టెస్ట్ కూడా పూర్తయిందట. గ్రామీణ నేపథ్యంలో సాగనున్న ఈ కథలో హీరోయిన్గా కీర్తి సురేష్(keerthy suresh) నటిస్తోంది. మొత్తం మీద యాక్షన్, ఎమోషన్, రియలిస్టిక్ అంశాల మేళవింపుగా రూపొందుతున్న రౌడీ జనార్దనపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.
ఇవి కూడా చదవండి








