Rowdy Janardhana: రౌడీ జనార్ధన మూవీపై ఇంట్రెస్టెంట్ అప్డేట్
రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ(vijay devarakonda) హీరోగా నటిస్తున్న తాజా సినిమా రౌడీ జనార్దన(Rowdy janardhana) ప్రస్తుతం ఇండస్ట్రీలో మంచి ఆసక్తిని రేకెత్తిస్తోంది. రవి కిరణ్ కోలా(ravikiran kola) దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాకు సంబంధించి ప్రొడక్షన్ పనులు వేగంగా కొనసాగుతున్నాయి. తాజా సమాచారం ప్రకారం, సినిమా తదుపరి షెడ్యూల్ కోసం రామోజీ ఫిల్మ్ సిటీలో భారీ సెట్ నిర్మాణం జరుగుతున్నట్టు తెలుస్తోంది. ఈ స్పెషల్ సెట్లో ముఖ్యంగా ఇంటర్వెల్ సీక్వెన్స్‌ను షూట్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తోంది. అలాగే కథలో కీలకమైన కొన్ని యాక్షన్ సీన్స్ ను కూడా ఇదే సెట్లో తెరకెక్కించనున్నారట.
ఈ యాక్షన్ ఎపిసోడ్స్‌లో ఎక్కువ భాగం విజయ్ దేవరకొండపై షూట్ చేయనున్నారని సమాచారం. కథకు అనుగుణంగా ఈ సన్నివేశాలు సినిమాకు ప్రధాన హైలైట్‌గా నిలుస్తాయని యూనిట్ భావిస్తోంది. మరోవైపు, ఈ సినిమాలో సీనియర్ నటి శోభన(Sobhana) కీలక పాత్రలో కనిపించనున్నారనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి. ఆమె క్యారెక్టర్ కథలో ప్రత్యేక ప్రాధాన్యం కలిగి ఉంటుందని టాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి.
ప్రఖ్యాత నిర్మాత దిల్ రాజు(Dil Raju) నిర్మిస్తున్న ఈ సినిమాలో సీనియర్ హీరో రాజశేఖర్(rajasekhar) కూడా ముఖ్య పాత్ర పోషిస్తున్నారు. ఆయన క్యారెక్టర్ ను చాలా భిన్నంగా, ఇప్పటివరకు ఆడియన్స్ చూడని విధంగా డిజైన్ చేసినట్లు తెలుస్తోంది. ఇప్పటికే రాజశేఖర్‌కు సంబంధించిన లుక్ టెస్ట్ పూర్తయిందని సమాచారం. గ్రామీణ నేపథ్యంలో సాగే ఈ సినిమాలో విజయ్ దేవరకొండకు జోడీగా కీర్తి సురేశ్(keerthy suresh) నటిస్తోంది. ఆసక్తికరమైన కథ, బలమైన నటీనటుల కాంబినేషన్‌తో ఈ సినిమాపై ప్రేక్షకుల్లో ఇప్పటికే భారీ అంచనాలు ఏర్పడ్డాయి.








