Peddi: పెద్ది కోసం మృణాల్ స్పెషల్ గా వస్తుందా?
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్(ram charan) హీరోగా తెరకెక్కుతున్న భారీ బడ్జెట్ సినిమా పెద్ది(peddi). ఈ సినిమా ఆఖరి దశ పనుల్లో వేగంగా ముందుకు సాగుతోంది. విలేజ్ బ్యాక్ డ్రాప్ స్పోర్ట్స్ డ్రామాగా రూపొందుతున్న ఈ సినిమాను బుచ్చిబాబు సాన(buchibabu Sana) ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నారు. ఏప్రిల్ 30న ప్రపంచవ్యాప్తంగా విడుదలకు సిద్ధమవుతున్న ఈ ప్రాజెక్ట్‌పై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. తాజా సమాచారం ప్రకారం, సినిమా షూటింగ్ ముగింపు దశలోకి చేరుకుని కీలక సన్నివేశాలు పూర్తవుతున్నాయి.
ఈ నేపథ్యంలో, ఏప్రిల్ మొదటి వారంలో ప్రత్యేకంగా రూపొందించిన భారీ సెట్లో ఒక స్పెషల్ సాంగ్ షూటింగ్ కు మేకర్స్ ప్లాన్ చేశారట. ఈ సాంగ్ లో రామ్ చరణ్(ram charan)తో పాటు హీరోయిన్ జాన్వీ కపూర్(janhvi kapoor) కూడా కనిపించనుండగా, స్పెషల్ ఎట్రాక్షన్ గా మృణాల్ ఠాకూర్(mrunal thakur) ను తీసుకురానున్నట్లు తెలుస్తోంది. ఆస్కార్ అవార్డు విన్నర్ ఏఆర్ రెహమాన్(AR Rahman) ఈ సాంగ్ కు మాస్ బీట్‌ను సిద్ధం చేయడంతో, ఈ స్పెషల్ సాంగ్ సినిమాకు మెయిన్ హైలైట్‌గా నిలుస్తుందని యూనిట్ భావిస్తోంది. భారీ ఖర్చుతో తెరకెక్కుతున్న ఈ సాంగ్ విజువల్‌గా కూడా ప్రత్యేకంగా ఉండబోతుందనే సమాచారం ఉంది.
ఇవి కూడా చదవండి
(adsbygoogle = window.adsbygoogle || []).push({});
ఇక బిజినెస్ పరంగా కూడా పెద్ది మంచి డిమాండ్‌ను సృష్టించిందని తెలుస్తోంది. థియేట్రికల్, నాన్-థియేట్రికల్ హక్కులు భారీ ధరలకు ముగిసినట్లు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. నిర్మాత వెంకట సతీష్ కిలారు(venkata satish kilaru) నిర్మిస్తున్న ఈ సినిమాకి సంబంధించిన టీజర్‌ను మార్చి 27న, రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా రిలీజ్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీంతో అభిమానులు ఈ సినిమాకు సంబంధించిన ప్రతి అప్డేట్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

ఇవి కూడా చదవండి








