Peddi: టార్గెట్ ను మిస్ అయ్యేదే లేదంటున్న పెద్ది టీమ్
టాలీవుడ్లో భారీ అంచనాలతో రూపొందుతున్న పెద్ది(peddi) రిలీజ్ పై రీసెంట్ గా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న వాయిదా వార్తలు అభిమానుల్లో ఆందోళనను కలిగిస్తున్నాయి. ముఖ్యంగా ఏప్రిల్ 30 రిలీజ్ డేట్ మిస్ అవుతుందనే ప్రచారం వేగంగా వైరల్ కావడంతో, ఫ్యాన్స్‌లో సందేహాలు నెలకొన్నాయి. ఇదిలా ఉండగా, మార్చి 27న రామ్ చరణ్(ram charan) బర్త్ డే సందర్భంగా డైరెక్టర్ బుచ్చిబాబు సాన(buchibabu sana) నుంచి స్ట్రాంగ్ అప్డేట్ రానుందనే అంచనాలు కూడా హైప్‌ను పెంచుతున్నాయి.
ఇవి కూడా చదవండి
అయితే యూనిట్ వర్గాల సమాచారం ప్రకారం, అనౌన్స్ చేసిన రిలీజ్ డేట్ ను మార్చే ఆలోచన ఏమాత్రం లేదని స్పష్టమవుతోంది. ప్రస్తుతం షూటింగ్ చివరి దశలో ఉండగా, ఒక స్పెషల్ సాంగ్ మాత్రమే పెండింగ్‌లో ఉందని తెలుస్తోంది. పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ సమాంతరంగా వేగంగా కొనసాగుతున్నాయి. మ్యూజిక్ డైరెక్టర్ ఏఆర్ రెహమాన్(AR Rahman) ఇప్పటికే ఫస్ట్ హాఫ్ రీ రికార్డింగ్ పూర్తి చేసి, రంజాన్ తర్వాత మిగతా పనులు ప్రారంభించేందుకు సిద్ధమవుతున్నారు. దీంతో ఏప్రిల్ 30న రిలీజ్‌పై టీమ్ పూర్తి నమ్మకంతో ఉంది.
బిజినెస్ పరంగా కూడా ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. మైత్రీ మూవీ మేకర్స్(Mythri movie makers), సుకుమార్ రైటింగ్స్(Sukumar writings) లాంటి బ్యానర్ల సహకారం వల్ల ప్రాజెక్ట్‌కు బలమైన బ్యాకింగ్ లభిస్తోంది. ఓవర్సీస్ బుకింగ్స్‌ను రామ్ చరణ్ బర్త్‌డే నుంచే ప్రారంభించే ప్లాన్‌లో ఉన్నట్టు సమాచారం. ఇప్పటికే రిలీజైన రెండు పాటలు మంచి స్పందన తెచ్చుకోవడంతో, మూడో సాంగ్‌పై అభిమానుల ఆసక్తి పెరుగుతోంది. మొత్తంగా చూస్తే, పెద్ది రిలీజ్‌పై ఉన్న పుకార్లకు భిన్నంగా, టీమ్ ప్లానింగ్ కచ్చితంగా ముందుకు సాగుతోందనే సంకేతాలు కనిపిస్తున్నాయి.
ఇవి కూడా చదవండి








