Dhurandhar-The Revenge: పుష్ప 2 ని టార్గెట్ చేసిన దురంధర్ 2..?
బాలీవుడ్ స్టార్ హీరో.. రణవీర్ సింగ్(Ranveer singh) ప్రధాన పాత్రలో నటించిన యాక్షన్ థ్రిల్లర్ ‘ధురందర్: ది రివెంజ్’ బాక్సాఫీస్ వద్ద దుమ్ము రేపుతోంది. ఆదిత్య ధర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం, కేవలం 15 రోజుల్లోనే సరికొత్త రికార్డులను తన ఖాతాలో వేసుకుంటుంది. తాజా ట్రేడ్ రిపోర్ట్స్ ప్రకారం, ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా రూ. 1500 కోట్ల వసూళ్లకు చేరువలో ఉంది. విడుదలైన 15వ రోజు నాటికి ఈ చిత్రం ఇండియన్ బాక్సాఫీస్(Box Office) వద్ద ఏ మాత్రం దూకుడు తగ్గకుండా దూసుకుపోతోంది.
15వ రోజున దాదాపు రూ. 17.80 కోట్లు వసూలు చేయగా, ఇప్పటివరకు ఇండియా వైడ్ గా నెట్ వసూళ్లు రూ. 937 కోట్లకు పైగా ఉండటం గమనార్హం. ఓవర్సీస్ మార్కెట్లో కూడా ఈ చిత్రం సత్తా చాటుతూ దాదాపు రూ. 370 కోట్లకు పైగా వసూలు చేసింది. దీంతో మొత్తంగా ప్రపంచవ్యాప్త గ్రాస్ వసూళ్లు రూ. 1,492 కోట్లను దాటి, త్వరలోనే 1500 కోట్ల క్లబ్లో చేరడానికి సిద్ధంగా ఉంది. ఇక కేజిఎఫ్ చాప్టర్ 2, ఆర్ఆర్ఆర్, జవాన్, పఠాన్, బాహుబలి 1 వంటి భారీ చిత్రాల లైఫ్‌టైమ్ వసూళ్లను ఇప్పటికే అధిగమించింది దురంధర్ 2.
రణవీర్ సింగ్ పవర్ఫుల్ పర్ఫార్మెన్స్, ఆదిత్య ధర్ అద్భుతమైన మేకింగ్ ప్రేక్షకులను థియేటర్లకు రప్పిస్తున్నాయి. ప్రస్తుతం ఈ చిత్రం హిందీ సినిమా చరిత్రలోనే అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రాలలో ఒకటిగా నిలిచింది. ప్రస్తుతం ధురందర్ 2 తర్వాతి టార్గెట్.. బాహుబలి 2, అల్లు అర్జున్ సెన్సేషన్ పుష్ప 2: ది రూల్ చిత్రాలే. ప్రస్తుతం ఉన్న జోరు చూస్తుంటే, మరికొన్ని రోజుల్లోనే ఈ చిత్రం ‘పుష్ప 2’ లైఫ్ టైం వసూళ్లను బ్రేక్ చేసే ఛాన్స్ ఉందని, సరికొత్త రికార్డులను క్రియేట్ చేసే అవకాశం ఉందని ట్రేడ్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
ఇవి కూడా చదవండి








