టాలీవుడ్ వారిని పట్టించుకోవడం లేదా?
ఇండియన్ సినీ పరిశ్రమలో ప్రస్తుతం పీరియడ్ సినిమాలకు భారీగా క్రేజ్ పెరుగుతోంది. మైథాలజీ, ఫాంటసీ ఎలిమెంట్స్‌తో కూడిన ఈ సినిమాలు ఆడియన్స్ కు ప్రేక్షకులకు విజువల్ స్పెక్టకిల్ మాత్రమే కాకుండా భావోద్వేగ అనుభూతిని కూడా అందిస్తున్నాయి. ఈ తరహా సినిమాల్లో కథనంతో పాటు సంగీతం, ముఖ్యంగా బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ కీలక పాత్ర పోషిస్తోంది. ఓ గొప్ప సీన్‌ను మరింత ఎలివేట్ చేయడంలో బీజీఎం ఎంత ప్రభావవంతంగా ఉంటుందో గతంలో వచ్చిన అనేక సినిమాలు ప్రూవ్ చేశాయి. అందుకే డైరెక్టర్లు కూడా ఈ జానర్ సినిమాల కోసం ప్రత్యేకమైన మ్యూజిక్ డైరెక్టర్లను ఎంపిక చేయడంపై దృష్టి పెడుతున్నారు.
ఇవి కూడా చదవండి
ఇలాంటి సందర్భంలో సంగీత దర్శక ద్వయం అజయ్(Ajay)- అతుల్(Atul) పేరు ప్రత్యేకంగా వినిపిస్తోంది. మరాఠీ సినిమాల ద్వారా తమ టాలెంట్‌ను నిరూపించుకున్న ఈ జంట, తర్వాత బాలీవుడ్లో కూడా సత్తా చాటింది. భారీ ఆర్కెస్ట్రేషన్, హృదయానికి హత్తుకునే మెలోడీలు, పవర్ఫుల్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్లతో వీరు ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. పీరియడ్ మరియు హిస్టారికల్ సినిమాలకు సరిపోయే సంగీతాన్ని అందించడంలో వీరు నిపుణులని పలుమార్లు రుజువు చేశారు. బాక్సాఫీస్ ఫలితాలు ఎలా ఉన్నా, వీరు పనిచేసిన సినిమాలకు సంగీత పరంగా మంచి ప్రశంసలు లభించడం విశేషం.
ఇప్పుడు రితేష్ దేశ్‌ముఖ్(Ritesh Deshmukh) రూపొందిస్తున్న మరాఠీ హిస్టారికల్ ఫిల్మ్ రాజా శివాజీ(raja shivaji) కోసం అజయ్- అతుల్ మరోసారి తమ మ్యూజికల్ మ్యాజిక్ చూపించినట్టు తెలుస్తోంది. తాజాగా రిలీజైన ఆంథమ్ సాంగ్ ప్రేక్షకులకు గూస్బంప్స్ కలిగిస్తూ మంచి స్పందనను సొంతం చేసుకుంది. అయితే ఇంతటి ప్రతిభ కలిగిన ఈ ద్వయాన్ని టాలీవుడ్ మాత్రం సరైన స్థాయిలో వినియోగించుకోలేదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. గతంలో రవితేజ(Ravi Teja) షాక్(Shock) తో తెలుగు ఎంట్రీ ఇచ్చిన వీరు, ఇప్పుడు విజయ్ దేవరకొండ(Vijay Devarakonda) రణబాలి(Ranbaali)తో మళ్లీ రాబోతున్నారు. పీరియడ్, మైథాలజీ, ఫాంటసీ సినిమాల కోసం వీరిని మరింతగా వినియోగించాల్సిన అవసరం ఉందని సినీ వర్గాలు భావిస్తున్నాయి.
ఇవి కూడా చదవండి








