Dhurandhar: దురంధర్ 2 ‘బాక్సాఫీస్’ ఊచకోత, సెకండ్ మండే టెస్ట్ పాస్..?
బాలీవుడ్ ఎనర్జిటిక్ స్టార్ రణవీర్ సింగ్(Ranveer Singh) నటించిన లేటెస్ట్ స్పై యాక్షన్ థ్రిల్లర్ ‘దురంధర్ 2’ (Dhurandhar: The Revenge) బాక్సాఫీస్ వద్ద పరుగుల సునామీ సృష్టిస్తోంది. ఆదిత్య ధర్(Aditya Dhar) దర్శకత్వంలో వచ్చిన ఈ సీక్వెల్ చిత్రం ఇప్పటికే అనేక రికార్డులను బద్దలు కొడుతూ చరిత్ర సృష్టిస్తోంది. వీకెండ్స్‌లోనే కాకుండా వీక్‌డేస్‌లో కూడా ఈ సినిమా తన సత్తా చాటుతోంది. సాధారణంగా ఏ పెద్ద సినిమాకైనా రెండో సోమవారం.. అనేది చాలా కీలకమైన పరీక్ష. వీకెండ్స్ తర్వాత వర్కింగ్ డే కావడంతో కలెక్షన్స్ తగ్గుతుంటాయి.
ఇవి కూడా చదవండి
‘దురంధర్ 2’ విషయంలో కూడా ఆదివారం వచ్చిన రూ. 68.10 కోట్లతో పోలిస్తే 12వ రోజు డ్రాప్ కనిపించినప్పటికీ, సినిమా నిలకడగానే రాణించింది. ట్రేడ్ వర్గాల సమాచారం (Sacnilk) ప్రకారం.. ఈ చిత్రం 12వ రోజు దేశవ్యాప్తంగా సుమారు రూ. 25.30 కోట్ల నెట్ వసూళ్లను సాధించింది. ఇది వర్కింగ్ డే రోజున చాలా మంచి వసూళ్లు అనే చెప్పాలి. ఈ 12వ రోజు కలెక్షన్లతో కలిపి భారత్ లో.. ‘దురంధర్ 2’ మొత్తం నెట్ కలెక్షన్లు రూ. 872.17 కోట్లకు చేరగా.. గ్రాస్ వసూళ్లు ఏకంగా రూ. 1,042.23 కోట్లు దాటాయి.
తద్వారా అతి తక్కువ రోజుల్లోనే ఇండియాలోనే రూ. 1000 కోట్ల గ్రాస్ మార్క్ అందుకున్న అరుదైన చిత్రాల క్లబ్లో రణవీర్ సింగ్ సినిమా చేరిపోయింది. టోటల్ వరల్డ్ వైడ్ గ్రాస్.. రూ. 1,392.23 కోట్లుగా ఉంది. ఈ జోరు చూస్తుంటే ఈ సినిమా రెండు వేల కోట్ల క్లబ్ లో చేరుతుందా అనేది చూడాలి. దురంధర్ సీరీస్ తో.. రికార్డుల రారాజుగా మారిన రణవీర్ సింగ్ కెరీర్లోనే ఇది బిగ్గెస్ట్ బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. అటు యశ్ నటించిన ‘కేజీఎఫ్-2’ లైఫ్‌టైమ్ ఇండియా కలెక్షన్స్ రికార్డులను కూడా ఈ చిత్రం బ్రేక్ చేసి దూసుకుపోతోంది.
ఇవి కూడా చదవండి








