హీరో కేశవ కాలవపల్లి పుట్టినరోజు సందర్భంగా చిత్ర కాన్సెప్ట్ పోస్టర్ విడుదల చేసిన చిత్ర బృందం
భజరంగి క్రియేషన్స్, ఆర్ ఆర్ క్రియేటివ్ క్రియేషన్స్ సంయుక్తంగా పాపిరెడ్డి కాలవపల్లి, రామిరెడ్డి అల్లూరి నిర్మాతలుగా రాయలసీమ కడప బ్యాక్ డ్రాప్ లో జరిగిన సరికొత్త ప్రేమ కథతో నూతన చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఏపీ04 రామాపురం సినిమాతో ప్రేక్షకుల మన్నన పొందిన దర్శకుడు యు హేమారెడ్డి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తూ కేశవ కాలవపల్లి అనే కొత్త హీరోని పరిచయం చేస్తున్నారు. ఈ సినిమాకి వినోద్ వైలా సంగీతం అందిస్తున్నారు. హీరో పుట్టినరోజు సందర్భంగా సినిమా కాన్సెప్ట్ పోస్టర్ను మూవీ టీం విడుదల చేసింది.
ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలను త్వరలోనే తెలియజేస్తామని జూన్ మొదటి వారం నుంచి షూటింగ్ మొదలవుతుందని మూవీ టీం పత్రికా ముఖంగా తెలియజేసింది.








