వారం గ్యాప్ లో క్రేజీ స్టార్టింగ్స్
కేవలం వారం రోజుల గ్యాప్ లో టాలీవుడ్లో రెండు భారీ ప్రాజెక్టులు ఘనంగా ప్రారంభం కానుండటంతో సినీ వర్గాల్లో ఆసక్తికరమైన చర్చ సాగుతోంది. సక్సెస్ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి(Anil ravipudi) తన తర్వాతి సినిమాను విక్టరీ వెంకటేష్(Venkatesh), నందమూరి కళ్యాణ్‌రామ్(kalyan ram) ప్రధాన పాత్రల్లో తెరకెక్కించడానికి సిద్ధమయ్యారు. ఇప్పటికే స్క్రిప్ట్ వర్క్‌తో పాటు ప్రీ-ప్రొడక్షన్ కార్యక్రమాలు పూర్తి కాగా, జూన్ 18న హైదరాబాద్‌లో ఈ సినిమాను అట్టహాసంగా ప్రారంభించనున్నారు. జూన్ 22 నుంచి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుండగా, ప్రస్తుతం ఆదర్శ కుటుంబం(Adarsha kutumbam) షూటింగ్ లో బిజీగా ఉన్న వెంకటేష్ తర్వాతి దశలో ఈ సినిమా సెట్స్‌లోకి అడుగుపెట్టనున్నారు.
అనిల్ రావిపూడి(anil ravipudi) మార్క్ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్, కామెడీ, ఎమోషన్స్‌తో ఈ సినిమా రూపొందనుందని సమాచారం. గతంలో వెంకటేష్‌తో ఎఫ్2(F2), ఎఫ్3(F3), సంక్రాంతికి వస్తున్నాం(sankranthiki vasthunnam) లాంటి సక్సెస్ లను అందించిన అనిల్ మరోసారి ప్రేక్షకులను అలరించే ప్రయత్నంలో ఉన్నారు. సాహు గారపాటి నిర్మిస్తున్న ఈ ప్రతిష్ఠాత్మక సినిమా సంక్రాంతి 2027 బరిలో నిలవనుంది. వెంకటేష్- కళ్యాణ్‌రామ్ కాంబినేషన్ కూడా ఈ సినిమాపై ప్రత్యేక అంచనాలను పెంచుతోంది.
మరోవైపు నందమూరి బాలకృష్ణ(balakrishna), దర్శకుడు కొరటాల శివ(koratala siva) కాంబినేషన్లో రూపొందనున్న భారీ సినిమా జూన్ 25న ప్రారంభం కానుంది. బలమైన సోషల్ మెసేజ్‌తో కూడిన మాస్ ఎంటర్టైనర్గా ఈ ప్రాజెక్ట్ తెరకెక్కనుందని టాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. అయితే రెగ్యులర్ షూటింగ్ మాత్రం దసరా తర్వాత ప్రారంభమయ్యే అవకాశం ఉంది. ప్రస్తుతం బాలకృష్ణ NBK111 షూటింగ్ ను పూర్తి చేసిన అనంతరం ఈ ప్రాజెక్ట్‌పై పూర్తి స్థాయిలో దృష్టి సారించనున్నారు. సుధాకర్ చెరుకూరి(Sudhakar cherukuri), సుధాకర్ మిక్కిలినేని(Sudhakar mikkilineni) సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమా సమ్మర్ 2027 రిలీజ్ టార్గెట్ గా రూపొందుతోంది. ఒకే నెలలో రెండు స్టార్ ప్రాజెక్టులు ప్రారంభం కావడం అభిమానుల్లో భారీ ఉత్సాహాన్ని రేకెత్తిస్తోంది.








