మృణాల్ ను ఫ్రెండ్స్ అలా పిలుస్తారట
టాలీవుడ్, బాలీవుడ్ ప్రేక్షకుల్లో తన ప్రత్యేకమైన నటనతో మంచి గుర్తింపు సంపాదించుకున్న హీరోయిన్ మృణాల్ ఠాకూర్(Mrunal thakur) తాజాగా చేసిన ఒక సరదా కామెంట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. తన ఫ్రెండ్స్ తనను హస్బెండ్ మర్డరర్ అని పిలుస్తారంటూ ఆమె చేసిన వ్యాఖ్య ఆసక్తిని రేకెత్తిస్తోంది. కారణం కూడా ఆమె చెప్పినట్లుగానే, తాను నటించిన కొన్ని భావోద్వేగభరితమైన ప్రేమ కథల్లో హీరోల పాత్రలు విషాదాంతానికి గురవడం. ఈ వ్యాఖ్యతో మృణాల్ తన సినిమా ఎంపికలపై ఒక కొత్త చర్చకు తెరతీసింది.
ఇవి కూడా చదవండి
ప్రత్యేకంగా జెర్సీ(Jersey) సినిమాలో షాహిద్ కపూర్(Shahid Kapoor) పాత్ర క్లైమాక్స్‌లో మరణించడం ప్రేక్షకులను భావోద్వేగానికి గురి చేసింది. అదే విధంగా సీతారామం(Sitaramam) సినిమాలో దుల్కర్ సల్మాన్(Dulquer Salman) పాత్ర విషాదాంతం కూడా ప్రేక్షకుల మనసుల్లో గాఢమైన ముద్ర వేసింది. ఈ రెండు సినిమాల్లో మృణాల్ పోషించిన పాత్రలు ప్రేమ, త్యాగం, భావోద్వేగాల మేళవింపుగా నిలిచాయి. దీంతో ఆమె సినిమాల్లో కథానాయకుల గమ్యం విషాదంతో ముగుస్తుందనే ఒక అభిప్రాయం ప్రేక్షకుల్లో ఏర్పడింది.
ఇక ఇప్పుడు ఆమె నటించిన తాజా చిత్రం డెకాయిట్(Dacoit) కూడా ఇదే ట్రెండ్‌ను కొనసాగిస్తుందా అనే ఆసక్తి నెలకొంది. ఇందులో అడివి శేష్(Adivi sesh) హీరోగా నటిస్తుండగా, ఈ కథ కూడా గాఢమైన భావోద్వేగాలతో నిండివుంటుంది. మృణాల్ చేసిన ఈ సరదా వ్యాఖ్య వెనుక నిజంగా ఏదైనా సింబాలిక్ ట్రెండ్ ఉందా, లేక ఇది కేవలం యాదృచ్ఛికమా అన్నది ఇప్పుడు సినీ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. మొత్తానికి, ఆమె వ్యాఖ్య సినిమాలపై మరింత ఆసక్తిని పెంచే విధంగా మారిందనడం అతిశయోక్తి కాదు.
ఇవి కూడా చదవండి








