గుంటూరులో వేగా జ్యుయలర్స్ ప్రారంభం
వేగా జ్యుయలర్స్ (Vega Jewelers) గుంటూరులోని లక్ష్మీపురం వద్ద నూతన ఆభరణాల షోరూంను ప్రారంభించింది. ప్రముఖ సినీనటుడు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna) ఈ షోరూంను ప్రారంభించారు. ఈ సందర్భంగా మేనేజింగ్ డైరెక్టర్ నవీన్ వనమా (Naveen Vanama) మాట్లాడుతూ గుంటూరు షోరూం ప్రారంభం సందర్భంగా మొదటి వంద మంది కొనుగోలుదారులకు ప్రతి కొనుగోలు పైన ఒక బంగారు నాణెం ఉచితంగా ఇస్తున్నామని చెప్పారు. షోరూంలో నిర్వహించే లక్కీ డ్రాలో టాప్ ఐదుగురు ఖాతాదారులు రూ.రెండు లక్షల విలువైన బంగారు లేదా వజ్రాల హారం గెలుపొందే అవకాశం ఉంటుందని పేర్కొన్నారు. ఈ ఆఫర్లు కేవలం తమ గుంటూరు షోరూం నందు మాత్రమేనని స్పష్టంచేశారు. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో వేగా జ్యుయలర్స్ సంస్థ చైర్మన్ బండ్లమూడి రామ్మోహన్ రావు, మేనేజింగ్ డైరెక్టర్ నవీన్ వనమా, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సుధాకర్ వనమాతోపాటు సినీ నటి డింపుల్ హయాతి (Dimple Hayathi), పలువురు నగర ప్రముఖులు పాల్గొన్నారు.
ఇవి కూడా చదవండి








