Car Prices: కారు కొనేవారికి షాక్.. ఏప్రిల్ 1 నుంచి ఎంజీ మోటార్ కార్ల ధరలు పైకి!
కొత్త ఆర్థిక సంవత్సరం ప్రారంభం కాకముందే కార్ల కొనుగోలుదారులకు ఆటోమొబైల్ కంపెనీలు షాకుల మీద షాకులు ఇస్తున్నాయి. ప్రముఖ కార్ల తయారీ సంస్థ జేఎస్‌డబ్ల్యూ ఎంజీ మోటార్ ఇండియా (JSW MG Motor India) తమ వాహనాల ధరలను (Car Prices) పెంచుతున్నట్లు అధికారికంగా ప్రకటించింది. పెరుగుతున్న ఉత్పత్తి వ్యయం (Production Costs), ముడిసరుకుల ధరల భారాన్ని తట్టుకోలేక ఎంపిక చేసిన మోడళ్లపై ఏప్రిల్ 1వ తేదీ నుంచి ధరలను 2 శాతం మేర పెంచుతున్నట్లు కంపెనీ ఒక ప్రకటనలో వెల్లడించింది.
ఎవరికి వర్తిస్తుంది.. ఎవరికి మినహాయింపు?
ఎంజీ మోటార్ తీసుకున్న ఈ తాజా నిర్ణయం కేవలం వారి మెయిన్‌లైన్ పోర్ట్‌ఫోలియోలోని (Mainline Portfolio) సాధారణ కార్లకు మాత్రమే (Car Prices) వర్తిస్తుంది. అంటే రోజూవారీ వినియోగించే ఇంటర్నల్ కంబషన్ ఇంజిన్ (ICE) వాహనాలు, ఎలక్ట్రిక్ వాహనాల (EVs) ధరలు పెరగనున్నాయి. అయితే ప్రీమియం కార్ల ప్రియులకు కంపెనీ చిన్న ఊరటనిచ్చింది. ‘ఎంజీ సెలక్ట్ ఛానెల్’ (MG Select Channel) ద్వారా ప్రత్యేకంగా విక్రయించే ఎంజీ ఎం9 (MG M9), సైబర్‌స్టర్ (Cyberster) వంటి అత్యంత లగ్జరీ ప్రీమియం కార్లను ఈ ధరల పెంపు (Car Prices) నుంచి మినహాయించినట్లు స్పష్టం చేసింది. ప్రస్తుతం ఎంజీ పోర్ట్‌ఫోలియోలో కార్ల ధరలు రూ. 4.99 లక్షల నుంచి ప్రారంభమై గరిష్ఠంగా రూ. 38.33 లక్షల (ఎక్స్-షోరూమ్) వరకు ఉన్నాయి.
(adsbygoogle = window.adsbygoogle || []).push({});
వరుసకడుతున్న ఇతర బ్రాండ్లు
కేవలం ఎంజీ మోటార్ మాత్రమే కాకుండా, దేశీయ మార్కెట్లోని మరికొన్ని అగ్రశ్రేణి ఆటోమొబైల్ సంస్థలు కూడా ఏప్రిల్ 1 నుంచి ధరల పెంచేందుకు (Car Prices) సై అంటున్నాయి. ఇప్పటికే దేశీయ దిగ్గజం టాటా మోటార్స్ (Tata Motors) తమ కమర్షియల్ వాహనాల ధరలను పెంచుతున్నట్లు ప్రకటించగా.. ఆడి (Audi), బీఎండబ్ల్యూ (BMW), మెర్సిడెస్ బెంజ్ (Mercedes-Benz) లాంటి ప్రతిష్టాత్మక లగ్జరీ కార్ల తయారీ కంపెనీలు కూడా ముడిసరుకు, రవాణా ఖర్చుల సాకుతో కొత్త ఆర్థిక సంవత్సరం తొలి రోజు నుంచే ధరల పెంపును ఖరారు చేశాయి.
ఇవి కూడా చదవండి








