Mahindra: మహీంద్రా నుంచి సరికొత్త ‘బీఈ 6 స్పోర్టెక్’ ఈవీ ఎస్యూవీ..రూ. 11.45 లక్షలకే లభ్యం!
వేరియంట్లు, ధరలు
మహీంద్రా బీఈ6 స్పోర్టెక్ మొత్తం 8 వేరియంట్లలో, 12 ఆకర్షణీయమైన కలర్ ఆప్షన్లలో లభించనుంది. వినియోగదారుల ప్రయాణ అవసరాలకు అనుగుణంగా 59 kWh, 70 kWh, 79 kWh బ్యాటరీ సామర్థ్యాలతో అందించారు. ఒకవేళ బాస్ మోడల్ కాకుండా, నేరుగా పూర్తి బ్యాటరీతో కలిపి (Mahindra) కారును కొనుగోలు చేయాలనుకుంటే.. 59 kWh ‘వన్’ వేరియంట్ ప్రారంభ ధర రూ. 19.45 లక్షల (ఎక్స్-షోరూమ్) నుంచి మొదలై, టాప్ వేరియంట్లకు రూ. 26.95 లక్షల వరకు ఉంటుంది. ముఖ్యంగా ఇందులో అందించిన ‘ఫార్ములా ఈ ఫ్రీడమ్ ఎడిషన్’ వేరియంట్ కేవలం 6.44 సెకన్లలోనే 0 నుండి గంటకు 100 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటుంది.
అత్యాధునిక ఇంటీరియర్ & ఏఐ ఫీచర్లు
ఈ కారులో డాష్‌బోర్డ్ అంతటా విస్తరించి ఉండే ‘త్రీ-స్క్రీన్ కోస్ట్-టు-కోస్ట్’ డిజిటల్ కాక్‌పిట్ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. పూర్తి సాఫ్ట్వేర్ ఆధారిత వాహనంగా రూపొందించిన ఈ కారులో గూగుల్ జెమిని ఏఐ ఆధారిత ‘టెక్ టాక్’ (Tech Talk) వాయిస్ అసిస్టెంట్‌ను పొందుపరిచారు. దీంతో పాటు భారత ఆటోమొబైల్ (Mahindra) చరిత్రలోనే మొదటిసారిగా అనేక వినూత్న ఫీచర్లను ఇందులో చేర్చారు:
ఎంటర్టైన్మెంట్: ప్రయాణాల్లో వినోదం కోసం కారు లోపలే కరోకే (Karaoke), ఇన్-కార్ గేమింగ్, అద్భుతమైన సౌండ్ అనుభూతినిచ్చే డాల్బీ అట్మోస్ సౌండ్ సిస్టమ్.
డిజిటల్ కీ: యాపిల్, శాంసంగ్ స్మార్ట్ఫోన్ల ద్వారా కారును సులభంగా అన్‌లాక్ చేసుకునే ఎన్ఎఫ్సీ (NFC) డిజిటల్ కీ సదుపాయం.
ఓటీఏ అప్డేట్స్: భవిష్యత్తులో ఓవర్-ది-ఎయిర్ (OTA) సాఫ్ట్వేర్ అప్డేట్ల ద్వారా ఈ కారులోని సరికొత్త ఫీచర్లను తమ పాత ఈవీ వినియోగదారులకు సైతం అందజేస్తామని మహీంద్రా (Mahindra) స్పష్టం చేసింది.








