Stock Markets: స్టాక్ మార్కెట్లలో ‘క్రూడ్’ మంటలు.. రూ. 5.63 లక్షల కోట్లు ఆవిరి!
భారతీయ ఈక్విటీ మార్కెట్లను (Stock Markets) కష్టాలు వీడటం లేదు. వరుస నష్టాలతో దేశీయ స్టాక్ మార్కెట్లు కుదేలవుతున్నాయి. అంతర్జాతీయ భౌగోళిక ఉద్రిక్తతలు, పెరుగుతున్న ముడి చమురు ధరలు, విదేశీ సంస్థాగత పెట్టుబడిదారుల (FII) వరుస అమ్మకాలతో గురువారం దలాల్ స్ట్రీట్‌లో భారీ పతనం చోటుచేసుకుంది. మదుపర్ల సెంటిమెంట్ తీవ్రంగా దెబ్బతినడంతో బెంచ్‌మార్క్ సూచీలు భారీ నష్టాలను మూటగట్టుకున్నాయి.
పతనానికి ప్రధాన కారణాలివే..
అమెరికా-ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య యుద్ధ మేఘాలు మరింత ముదురుతుండటంతో గ్లోబల్ మార్కెట్లు తీవ్ర ఒత్తిడికి గురయ్యాయి. దీని ప్రభావం మన మార్కెట్లపై (Stock Markets) స్పష్టంగా కనిపించింది. ఈ ఉద్రిక్తతల దెబ్బకు అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు మళ్లీ బ్యారెల్‌కు 100 డాలర్ల సమీపానికి చేరాయి. భారత్ తన చమురు అవసరాలకు ఎక్కువ శాతం దిగుమతులపైనే ఆధారపడుతున్నందున.. ఈ ధరల పెరుగుదల దేశీయంగా ద్రవ్యోల్బణాన్ని (Inflation) పెంచడంతో పాటు, కరెంట్ ఖాతా లోటును (CAD) మరింత విస్తృతం చేస్తుందన్న ఆందోళనలు మార్కెట్లను వణికించాయి.
ఇవి కూడా చదవండి
(adsbygoogle = window.adsbygoogle || []).push({});
భారీగా ఆవిరైన సంపద..
అమ్మకాల వెల్లువతో ప్రధాన రంగాలైన ఆటోమొబైల్, బ్యాంకింగ్, క్యాపిటల్ గూడ్స్ షేర్లు భారీగా పతనమయ్యాయి. మార్కెట్ (Stock Markets) ముగిసే సమయానికి సెన్సెక్స్ ఏకంగా 829.29 పాయింట్లు పతనమై 76,034 వద్ద స్థిరపడగా.. నిఫ్టీ 227.70 పాయింట్లు క్షీణించి 23,639 వద్ద ముగిసింది. ఈ భారీ పతనంతో కేవలం ఒక్కరోజులోనే ఇన్వెస్టర్ల సంపద సుమారు రూ. 5.63 లక్షల కోట్లు ఆవిరైపోయింది. దీంతో బీఎస్ఈ (BSE) లిస్టెడ్ కంపెనీల మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ. 436.27 లక్షల కోట్లకు పడిపోయింది. మరోవైపు, కరెన్సీ మార్కెట్లోనూ రూపాయి విలువ డీలాపడింది. అమెరికన్ డాలర్‌తో పోలిస్తే మారకం విలువ ఏకంగా రూ. 92.22 వద్దకు చేరింది.
ఇవి కూడా చదవండి








