Team India: టీమిండియా విజయాల వెనుక గంభీర్-అగార్కర్-సూర్యల వ్యూహం!
ఒక జట్టు ప్రపంచకప్ లాంటి మెగా టోర్నీని నెగ్గాలంటే కేవలం మైదానంలో ఆటగాళ్ల ప్రతిభ మాత్రమే సరిపోదు. వారిని సరైన దిశలో నడిపించే పదునైన కోచ్, ప్రతిభావంతులను ఏరికోరి ఎంపిక చేసే సెలెక్టర్, జట్టును ముందుండి నడిపించే నాయకుడు.. ఈ ముగ్గురూ కచ్చితంగా ఉన్నప్పుడే అద్భుతాలు సృష్టించగలం. సరిగ్గా ఇప్పుడు భారత క్రికెట్ జట్టులో (Team India) హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్, చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్, కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్‌ల త్రయం ప్రతిష్టాత్మక టీ20 ప్రపంచకప్ (2026) విజయంతో ఈ విషయాన్ని అక్షరాలా నిరూపించింది.
కఠిన నిర్ణయాలే కప్పు తెచ్చాయి..
పొట్టి ప్రపంచకప్‌కు ముందు గంభీర్, అగార్కర్ తీసుకున్న కొన్ని సాహసోపేతమైన, కఠిన నిర్ణయాలే ఈ అద్భుత విజయానికి ప్రధాన కారణం. రోహిత్ శర్మ టీ20లకు వీడ్కోలు పలికాక, హార్దిక్ పాండ్యాకు కాకుండా సూర్యకుమార్ యాదవ్‌కు సారథ్య (Team India) బాధ్యతలు అప్పగించడం తొలి సంచలనం. భవిష్యత్ కెప్టెన్‌గా భావిస్తూ సూర్యకు డిప్యూటీగా ఉన్న శుభ్‌మన్ గిల్ ఫామ్ లేమితో తడబడటంతో నిర్మొహమాటంగా పక్కనపెట్టారు. ఫామ్ తాత్కాలికమని, ఆడే విధానమే (Intent) ముఖ్యమని ఇతర ఆటగాళ్లకు స్పష్టమైన సంకేతాలు పంపారు. దేశవాళీలో సత్తా చాటిన వికెట్ కీపర్ బ్యాటర్ ఇషాన్ కిషన్‌ను దాదాపు రెండేళ్ల తర్వాత జాతీయ జట్టులోకి (Team India) తీసుకొచ్చారు. తన ఎంపిక సరైనదేనని నిరూపిస్తూ కిషన్ టీ20 వరల్డ్ కప్‌లో సృష్టించిన విధ్వంసం అందరికీ తెలిసిందే. ఈ సాహసోపేత ఎంపికల వల్లే గంభీర్.. వరల్డ్ కప్ విజయాన్ని అగార్కర్‌కు అంకితమిచ్చాడు.
ఇవి కూడా చదవండి
(adsbygoogle = window.adsbygoogle || []).push({});
హ్యాట్రిక్ టైటిళ్లు..
గంభీర్-అగార్కర్ ద్వయం మార్గదర్శకత్వంలో భారత జట్టు (Team India) ఇప్పటికే హ్యాట్రిక్ టైటిళ్లను ముద్దాడి ప్రపంచ క్రికెట్లో తన ఆధిపత్యాన్ని చాటుకుంది.
ఛాంపియన్స్ ట్రోఫీ (2025)
ఆసియా కప్ (2026)
టీ20 ప్రపంచకప్ (2026)
పదవీకాలం పొడిగింపు..
చీఫ్ సెలెక్టర్‌గా అజిత్ అగార్కర్ పదవీకాలం వాస్తవానికి ఈ ఏడాది జూన్‌తో ముగియనుంది (ఇప్పటికే ఒకసారి పొడిగించారు). అయితే, రాబోయే 2027 వన్డే ప్రపంచకప్, వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ (WTC) ఫైనల్, 2028 లాస్ ఏంజిల్స్ ఒలింపిక్స్, 2028 టీ20 ప్రపంచకప్ వంటి మెగా టోర్నీల నేపథ్యంలో.. ఆయన పదవీకాలాన్ని మరింత పొడిగించే అవకాశాలు బలంగా కనిపిస్తున్నాయి.
మరోవైపు, హెడ్ కోచ్‌గా (Team India) గౌతమ్ గంభీర్ పదవీకాలం 2027 వన్డే ప్రపంచకప్ వరకు ఉంది. ఒకవేళ గంభీర్ కోచ్‌గా వన్డే ప్రపంచకప్‌ను కూడా నెగ్గితే.. ఆటగాడిగా (2007 టీ20, 2011 వన్డే ప్రపంచకప్‌లు), కోచ్‌గా రెండు పరిమిత ఓవర్ల ఫార్మాట్లలోనూ విశ్వవిజేతగా నిలిచిన ఏకైక క్రికెటర్‌గా ఒక అరుదైన చారిత్రక ఘనతను సొంతం చేసుకుంటాడు.
ఇవి కూడా చదవండి








