Rohit Sharma: రోహిత్ 2.0 వచ్చేశాడు.. మిగతా ఫ్రాంచైజీలకు వణుకే!
ఐపీఎల్ (IPL 2026) 19వ సీజన్‌ను ముంబై ఇండియన్స్ మాజీ కెప్టెన్, ‘హిట్‌మ్యాన్’ రోహిత్ శర్మ (Rohit Sharma) కళ్లు చెదిరే సూపర్ ఇన్నింగ్స్‌తో ఆరంభించాడు. కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR)తో జరిగిన మ్యాచ్‌లో రోహిత్ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. కేవలం 38 బంతుల్లోనే 200కు పైగా స్ట్రైక్ రేట్‌తో విరుచుకుపడి 78 పరుగులు సాధించి, ముంబై ఘన విజయంలో కీలక పాత్ర పోషించాడు. రోహిత్ ఆడిన ఈ విధ్వంసకర ఇన్నింగ్స్‌పై భారత స్పిన్ దిగ్గజం, మాజీ క్రికెటర్ అనిల్ కుంబ్లే (Anil Kumble) ప్రశంసల వర్షం కురిపించాడు. ఈ సీజన్లో ఐపీఎల్‌లోని మిగతా జట్లను కుంబ్లే సున్నితంగా హెచ్చరించాడు.
రోహిత్ 2.0.. ఇక జాగ్రత్త!
కోల్‌కతాపై రోహిత్ శర్మ (Rohit Sharma) ఆడిన విధానం చూశాక ఒక్కటే చెప్పాలనిపిస్తోందని, ‘రోహిత్ 2.0’ (Rohit Sharma) వచ్చేసిందని కుంబ్లే అన్నాడు. “క్రీజులో రోహిత్ బంతిని ఎదుర్కొన్న తీరు మిగతా జట్లకు ఒక స్పష్టమైన హెచ్చరిక పంపినట్లుగా ఉంది. అతడు తన అత్యుత్తమ ఫామ్‌లో ఉన్నప్పటి పాత రోజులను మళ్లీ గుర్తు చేశాడు. వరుణ్ చక్రవర్తి, సునీల్ నరైన్, బ్లెస్సింగ్ ముజరబాని లాంటి అత్యుత్తమ బౌలర్లపై ఆధిపత్యం ప్రదర్శించడం అంత సులువైన విషయం కాదు. కానీ, రోహిత్ (Rohit Sharma) తనదైన శైలిలో అలవోకగా సిక్సర్లు బాదేశాడు” అని కుంబ్లే చెప్పాడు.
ఇవి కూడా చదవండి
“తన ఫిట్‌నెస్‌పై అతడు చాలా శ్రమించినట్లు స్పష్టంగా కనిపిస్తోంది. సాధారణంగా కొంత విరామం తర్వాత మైదానంలోకి అడుగుపెడితే ఆ లయను అందుకోవడానికి ఏ ఆటగాడికైనా కనీసం ఐదారు రోజులు పడుతుంది. కానీ రోహిత్ చాలా ఫ్రెష్‌గా కనిపించాడు. ఈ ఐపీఎల్ సీజన్లో తన ఉద్దేశం ఏంటో తొలి మ్యాచ్‌లోనే బ్యాట్‌తో చెప్పేశాడు” అని కుంబ్లే విశ్లేషించాడు.
(adsbygoogle = window.adsbygoogle || []).push({});
కేకేఆర్ వ్యూహాలపై కుంబ్లే అసంతృప్తి
ఈ సందర్భంగా కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR) వ్యూహాలపై, ముఖ్యంగా బౌలింగ్ మార్పులపై అనిల్ కుంబ్లే ఆశ్చర్యం వ్యక్తం చేశాడు. కోల్‌కతా బౌలింగ్ లైనప్‌లో సునీల్ నరైన్ (Sunil Narine), వరుణ్ చక్రవర్తి అత్యంత కీలకం అన్న విషయం తెలిసిందే. “రోహిత్ శర్మ (Rohit Sharma), రికెల్టన్ పవర్‌ప్లేలో (Powerplay) అత్యంత దూకుడుగా ఆడుతున్నప్పుడు.. వారిని నిలువరించేందుకు నరైన్‌కు బౌలింగ్ ఇవ్వకపోవడం నన్ను తీవ్రంగా నిరుత్సాహపరిచింది. నరైన్ బౌలింగ్‌కు వచ్చే సమయానికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. పైగా నరైన్ తన నాలుగు ఓవర్ల కోటాను కూడా పూర్తి చేయకపోవడం ఆశ్చర్యకరం. సరిగ్గా ఇక్కడే కోల్‌కతా తమ విజయావకాశాలను చేజేతులా దెబ్బతీసుకుంది. తమ దగ్గర ఉన్న అత్యుత్తమ వనరులను కేకేఆర్ మరింత మెరుగ్గా వినియోగించుకోవాలి” అని కుంబ్లే సూచించాడు.
ఇవి కూడా చదవండి








