West Indies: వెస్టిండీస్ క్రికెట్లో ఫిక్సింగ్ కలకలం.. ముగ్గురిపై ఐసీసీ వేటు!
కరీబియన్ క్రికెట్లో (West Indies) మరోసారి మ్యాచ్ ఫిక్సింగ్ భూతం ప్రకంపనలు సృష్టిస్తోంది. వెస్టిండీస్ క్రికెట్ బోర్డు (CWI) అధికారికంగా నిర్వహించిన ‘బీమ్ 10 లీగ్’ (BIM 10 League) 2023-24 సీజన్లో భారీ అవినీతి చోటుచేసుకున్నట్లు అంతర్జాతీయ క్రికెట్ మండలి (ICC) తాజాగా తీవ్ర అభియోగాలు మోపింది.
ఐసీసీ సస్పెన్షన్ వేటు పడింది వీరిపైనే:
ఈ ఫిక్సింగ్ ఆరోపణల నేపథ్యంలో ఒక ఆటగాడితో సహా మొత్తం ముగ్గురిపై ఐసీసీ కఠిన చర్యలకు ఉపక్రమించింది. వీరిలో వెస్టిండీస్ (West Indies) దేశవాళీ ఆల్‌రౌండర్ జెవాన్ సీర్లెస్ (Javon Searles), టైటాన్స్ జట్టు యజమాని చిత్రంజన్ రాథోడ్, ఆ జట్టు అధికారి ట్రెవాన్ గ్రిఫిత్ ఉన్నారు.
ఇవి కూడా చదవండి
నియమావళి ఉల్లంఘన..
గత సీజన్ లీగ్ సమయంలో వీరు మ్యాచ్‌లను ప్రభావితం చేసేలా ఫిక్సింగ్‌కు పాల్పడేందుకు ప్రయత్నించారని ఐసీసీ ప్రాథమిక విచారణలో తేలింది. వెస్టిండీస్ (West Indies) క్రికెట్ బోర్డు రూపొందించిన అవినీతి నిరోధక నియమావళి (Anti-Corruption Code) నిబంధనలను వీరు ఉల్లంఘించినట్లు అభియోగాలు నమోదు చేసింది. దీనిలో భాగంగా ఈ ముగ్గురినీ అన్ని ఫార్మాట్ల క్రికెట్ కార్యకలాపాల నుంచి తక్షణమే తాత్కాలికంగా సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటించింది. అయితే తమపై మోపిన ఈ అభియోగాలపై అధికారికంగా వివరణ ఇచ్చుకునేందుకు వీరికి 14 రోజుల గడువును మంజూరు చేసింది.
(adsbygoogle = window.adsbygoogle || []).push({});
ఐపీఎల్లో ఆడిన జెవాన్ సీర్లెస్..
సస్పెన్షన్‌కు గురైన జెవాన్ సీర్లెస్ విండీస్ (West Indies) దేశవాళీ క్రికెట్ సర్క్యూట్లో సుదీర్ఘకాలంగా పలు లీగ్‌లు ఆడుతున్నాడు. ముఖ్యంగా ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL)లోనూ అతను గతంలో పాల్గొనడం గమనార్హం. 2018 సీజన్లో కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR) జట్టుకు అతను ప్రాతినిధ్యం వహించాడు. ఫ్రాంచైజీ లీగ్స్‌లో కీలక ఆటగాళ్లు, నిర్వాహకులు ఏకంగా ఫిక్సింగ్ ఆరోపణలతో ఐసీసీ వేటుకు గురికావడం కరీబియన్ ద్వీపాలతో పాటు అంతర్జాతీయ క్రికెట్లో తీవ్ర చర్చనీయాంశమైంది.
ఇవి కూడా చదవండి








