Sunrisers Hyderabad: అభిమానులకు బిగ్ రిలీఫ్.. సెకండాఫ్‌లో ఆ స్టార్ రీఎంట్రీ!
ఐపీఎల్ (IPL) 2026 మహా సంగ్రామానికి సిద్ధమవుతున్న సన్‌రైజర్స్ హైదరాబాద్ (Sunrisers Hyderabad) ఫ్రాంచైజీకి, అభిమానులకు ఒక భారీ శుభవార్త అందింది. గత కొంతకాలంగా తీవ్రమైన వెన్నునొప్పితో (Back injury) బాధపడుతున్న ఆ జట్టు రెగ్యులర్ కెప్టెన్ ప్యాట్ కమిన్స్.. ఈ సీజన్లో ఆడే విషయంపై నెలకొన్న సందిగ్ధతకు ఎట్టకేలకు తెరపడింది. తాను గాయం నుంచి వేగంగా కోలుకుంటున్నానని, టోర్నీ ద్వితీయార్ధంలో (Second half) తిరిగి జట్టుతో చేరతానని కమిన్స్ స్వయంగా ప్రకటించి అభిమానుల్లో కొత్త జోష్ నింపాడు.
మైదానంలోకి ఆసీస్ స్టార్
మార్చి 28న (రేపు) చిన్నస్వామి స్టేడియం వేదికగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB)తో సన్‌రైజర్స్ (Sunrisers Hyderabad) తన తొలి మ్యాచ్ ఆడనుంది. ఈ మ్యాచ్‌కు సన్నద్ధమవుతున్న క్రమంలో, బుధవారం బెంగళూరులో జరిగిన ఎస్ఆర్హెచ్ ప్రాక్టీస్ సెషన్లో కమిన్స్ ఉత్సాహంగా పాల్గొనడం అందరి దృష్టిని ఆకర్షించింది. పూర్తిస్థాయిలో బౌలింగ్ చేయకపోయినా.. సహచరులతో కలిసి వార్మప్ చేయడం, ఫీల్డింగ్, క్యాచ్‌ల సాధన చేశాడు. అంతేకాకుండా షార్ట్ రనప్‌తో ఖాళీ నెట్స్‌లో కొన్ని బంతులు విసిరి తన ఫిట్నెస్ పురోగతిపై సానుకూల సంకేతాలు ఇచ్చాడు. డ్రెస్సింగ్ రూమ్‌లో కమిన్స్ భౌతిక ఉనికి జట్టు నైతిక స్థైర్యాన్ని (Morale) పెంచేందుకు ఎంతగానో ఉపయోగపడుతుంది.
ప్లే ఆఫ్స్ నాటికి సిద్ధం
తన గాయం, రీ-ఎంట్రీపై తాజాగా ఒక పాడ్‌కాస్ట్‌లో మాట్లాడిన కమిన్స్ పరిస్థితిని స్పష్టంగా వివరించాడు. “వెన్ను గాయం నుంచి నేను ఇంకా పూర్తిగా కోలుకునే దశలోనే ఉన్నాను. కానీ ప్రస్తుతం నా శరీరం మునుపటి కంటే చాలా మెరుగ్గా సహకరిస్తోంది. నెట్స్‌లో బౌలింగ్ కూడా చేయగలుగుతున్నాను. ఐపీఎల్ సీజన్ ఆరంభ మ్యాచ్‌లకు నేను అందుబాటులో ఉండకపోవచ్చు. కానీ అంతా అనుకున్నట్లు జరిగితే టోర్నీ (Sunrisers Hyderabad) మధ్యలో జట్టుతో కలుస్తాను. ముఖ్యంగా ప్లే ఆఫ్స్, ఫైనల్స్ దశలో మైదానంలో వంద శాతం ఫిట్నెస్తో బరిలోకి దిగుతాను” అని కమిన్స్ ధీమా వ్యక్తం చేశాడు. అద్భుతమైన నాయకత్వ లక్షణాలున్న ప్యాట్ కమిన్స్ లాంటి వరల్డ్ క్లాస్ బౌలర్ దూరం కావడం ఆరంభంలో సన్‌రైజర్స్‌కు కాస్త లోటే అయినప్పటికీ.. ప్లే ఆఫ్స్ రేసు వేడెక్కే సెకండాఫ్‌లో అతడు జట్టులోకి రావడం కచ్చితంగా ఎస్ఆర్హెచ్ బౌలింగ్ దళాన్ని, వ్యూహాలను అమాంతం పటిష్టం చేస్తుంది.
ఇవి కూడా చదవండి








