SRH: హైదరాబాద్ వీక్నెస్ పట్టేసిన ప్రత్యర్ధులు
ఐపీఎల్ లో సన్ రైజర్స్ హైదరాబాద్(SRH) జట్టు బ్యాటింగ్ అనగానే.. 250 నుంచి 300 వరకు స్కోర్ అభిమానులు ఆశిస్తున్నారు. బౌలింగ్ ఎలా ఉన్నా సరే భారీ స్కోర్ చేయడమే లక్ష్యంగా హైదరాబాద్ బ్యాటింగ్ లైనప్ కష్టపడుతోంది. ముఖ్యంగా ఓపెనర్లు ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ(Abhishek Sharma).. ఇషాన్ కిషన్ భారీగా పరుగులు చేసేందుకు తహతహలాడుతున్నారు. అయితే గత రెండు మ్యాచ్ల నుంచి హైదరాబాద్ దూకుడుకు అడ్డుకట్ట వేస్తున్నాయి ప్రత్యర్థి జట్లు. లక్నోతో మ్యాచ్లో హైదరాబాద్ బ్యాటింగ్ విలువలలాడింది.
భారీ స్కోర్ చేయలేక చతికలపడింది. కనీసం 200 కూడా స్కోర్ చేయలేకపోయింది. ఇక తాజాగా ఢిల్లీతో జరిగిన మ్యాచ్ లో కూడా ఇలాగే జరిగింది. ముఖ్యంగా ఢిల్లీ ఫాస్ట్ బౌలర్ మిచెల్ స్టార్క్ బౌలింగ్ లో ఆడటానికి హైదరాబాద్ బ్యాట్స్మెన్ ఇబ్బంది పడ్డారు. యదేచ్చగా పరుగులు చేసే ఓపెనర్లు అలాగే మిడిల్ ఆర్డర్ బ్యాట్స్మెన్ పరుగులు చేసేందుకు సతమతమయ్యారు. ఇక మిగిలిన బౌలర్ల నుంచి కూడా స్టార్క్ కు సహకారం ఉండటంతో చుక్కలు చూపించారు.
ఇక హైదరాబాద్ బౌలింగ్ కూడా బలహీనంగానే కనపడుతుంది. వేలం సమయంలో బ్యాటింగ్ పైనే ఎక్కువగా దృష్టి పెట్టిన ఓనర్లు.. బౌలింగ్ పై అంతగా దృష్టి పెట్టలేదు అనే ఆరోపణలు వినపడుతున్నాయి. కేవలం కెప్టెన్ కమిన్స్ ను మాత్రమే నమ్ముకున్నారు. దీనితో ఎంత స్కోర్ చేసినా సరే హైదరాబాదు బౌలింగ్ మాత్రం బలహీనంగా ఉంది. ముఖ్యంగా స్టార్క్ దెబ్బకు హైదరాబాద్ ఆటగాళ్లు భయపడిపోతున్నారు. గత ఏడాది జరిగిన ఫైనల్ మ్యాచ్లో కూడా స్టార్క్ దుమ్మురేపాడు. కీలక సమయంలో హెడ్ అలాగే రాహుల్ త్రిపాఠి వికెట్లు తీశాడు. ఇప్పుడు టాప్ ఆర్డర్ తో పాటుగా మొత్తం ఐదు వికెట్లు పడగొట్టాడు. మొన్నటి వరకు ప్రత్యర్థులను ఆత్మ రక్షణలో నెట్టిన హైదరాబాద్ ఆటగాళ్లు ఇప్పుడు ఆత్మ రక్షణలో పడిపోయే పరిస్థితి ఏర్పడింది.






