David Reddy: రాకింగ్ స్టార్ మంచు మనోజ్ భారీ పాన్ ఇండియా పీరియాడిక్ యాక్షన్ మూవీ “డేవిడ్ రెడ్డి” ఫస్ట్ లుక్
రాకింగ్ స్టార్ మంచు మనోజ్ నటిస్తున్న కొత్త సినిమా “డేవిడ్ రెడ్డి”. ఈ సినిమాను వెల్వెట్ సోల్ మోషన్ పిక్చర్స్, ట్రూ రాడిక్స్ బ్యానర్స్ పై నల్లగంగుల వెంకట్ రెడ్డి, భరత్ మోటుకూరి నిర్మిస్తున్నారు. డైరెక్టర్ హనుమ రెడ్డి యక్కంటి రూపొందిస్తున్నారు. బ్రిటీష్ కాలం నాటి బ్యాక్ డ్రాప్ తో ఇంటెన్స్ యాక్షన్ డ్రామా కథతో భారీ పాన్ ఇండియా చిత్రంగా “డేవిడ్ రెడ్డి” సినిమా తెరకెక్కనుంది. ఈ చిత్రంలో మారియా ర్యబోషప్క హీరోయిన్ గా నటిస్తోంది. తెలుగు, హిందీ, తమిళ, మలయాళ, కన్నడలో ఈ సినిమా రూపొందుతోంది. ఈ రోజు రిపబ్లిక్ డే సందర్భంగా “డేవిడ్ రెడ్డి” సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్స్ లాంఛ్ చేశారు.
“డేవిడ్ రెడ్డి” ఫస్ట్ లుక్ పోస్టర్స్ లో రూత్ లెస్, బ్రూటల్ అనే రెండు లుక్స్ లో మంచు మనోజ్ ఇంటెన్స్ గా కనిపించి ఆకట్టుకుంటున్నారు. ఈ రెండు లుక్స్ చూస్తే మూవీలో టెర్రఫిక్ యాక్షన్ ఉంటుందని తెలుస్తోంది. మంచు మనోజ్ తన మేకోవర్, బాడీ లాంగ్వేజ్, లుక్స్, పర్ ఫార్మెన్స్ తో డేవిడ్ రెడ్డి పాత్రకు లైఫ్ ఇచ్చినట్లు కనిపిస్తోంది. ఈ సినిమా మనోజ్ కు ఒక మంచి కమ్ బ్యాక్ అవుతుందనే అంచనాలు ఏర్పడుతున్నాయి. ఫస్ట్ లుక్ పోస్టర్ తో “డేవిడ్ రెడ్డి” సినిమా స్ట్రాంగ్ బజ్ క్రియేట్ చేస్తోంది.
1897 నుంచి 1920 మధ్య బ్రిటీష్ పాలనా కాలాన్ని నేపథ్యంగా తీసుకుని “డేవిడ్ రెడ్డి” సినిమాను ప్రతిష్టాత్మకంగా మేకర్స్ రూపొందిస్తున్నారు. ఈ సినిమాలో బ్రిటీష్ క్రూర పాలనకు ఎదురునిలిచి పోరాడిన యోధుడి పాత్రలో మనోజ్ నటిస్తున్నారు. ఈ సినిమా నుంచి త్వరలో మరిన్ని అప్డేట్స్ ఇవ్వబోతున్నారు.






