క్రెడాయ్ హైదరాబాద్ ప్రాపర్టీ షో 2026
హైదరాబాద్ నగరంలో రియల్ ఎస్టేట్ రంగానికి వచ్చిన ఇబ్బందేమీ లేదని, ఏడేళ్లుగా స్థిరమైన అభివృద్ధితో ముందుకెళ్తోందని క్రెడాయ్ హైదరాబాద్ అధ్యక్షుడు ఎన్.జైదీప్ రెడ్డి, కాబోయే అధ్యక్షుడు బి.జగన్నాథరావు అన్నారు. ఈ నెల 28, 29 30 తేదీల్లో హైటెక్స్‌లో ‘క్రెడాయ్ హైదరాబాద్ ప్రాపర్టీ షో 2026’ నిర్వహించనున్నట్లు తెలిపారు.
బంజారాహిల్స్‌లోని క్రెడాయ్ కార్యాలయంలో వారు మాట్లాడుతూ, ఈ ఏడాది ప్రాపర్టీ షోను ‘రేటు ఆగదు .. డిమాండ్ తగ్గదు’ అనే అంశంపై నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. ఇందులో 65 సంస్థలు పాల్గొంటున్నాయని, 300కు పైగా ప్రాజెక్టులను ప్రదర్శిస్తాయని చెప్పారు.
కొనుగోలుదారుల్లో ఉన్న అనుమానాలు తీర్చి రియల్ ఎస్టేట్ రంగంపై స్పష్టత వచ్చేందుకు ఈ ప్రదర్శన వల్ల ఉపయోగం ఉంటుందన్నారు. ఈ సందర్భంగా పవర్ పాయింట్ ప్రజంటేషన్ ప్రదర్శించి హైదరాబాద్‌లో ఏడేళ్లుగా రియల్ ఎస్టేట్ రంగం అభివృద్ధి చెందుతున్న తీరును వారు వివరించారు.








