రాఖీపౌర్ణమి ఒక విశిష్టమైన పండుగ
అన్నా, చెల్లెలి అనుబంధానికి ప్రతీక రాఖీ పండుగ. ఈ విశిష్టమైన పర్వదినాన్ని పురస్కరించుకొని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డికి ఆయన చెల్లెలు షర్మిల రాఖీ కట్టారు. తనకు వైఎస్ షర్మిల ఆత్మీయంగా రాఖీ కడుతున్న ఫొటోను వైఎస్ జగన్ తన ట్విట్టర్ పేజీలో పోస్టు చేశారు. అక్కచెల్లెమ్మలందరూ ఇప్పుడు, ఎల్లప్పుడూ ఆనందంగా ఉండాలని ఆయన ఈ సందర్భంగా ఆకాంక్షించారు.








