కరీంనగర్…వాటర్ హబ్
ఎల్లంపల్లి – మిడ్మానేరుల అనుసంధానంతో వచ్చే జూన్‌లోగా కరీంనగర్ వాటర్‌హబ్‌గా మారబోతుందని ఆర్థికమంత్రి ఈటల రాజేందర్ పేర్కొన్నారు. రాష్ట్ర రైతాంగాన్ని ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకుంటుందని స్పష్టం చేశారు. రైతులకు రూ. 17 వేల కోట్ల రుణాలు మాఫీ చేశామని తెలిపారు. రైతులు శాసించే స్థితిలో ఉండాలనే రైతు సమన్వయ కమిటీల ఏర్పాటు అని చెప్పారు.








